Snake bites child while recording reels video: ఇటీవల చాలా మంది జనాలు సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు. వైరల్ కావడం, వ్యూస్ కావడం కోసం తమ ప్రాణాలు లేదా ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్ లో పడేస్తున్నారు. ఏది చేసిన ఫెమస్ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. జలపాతాలు, జంతువులు మొదలైన చోటకు వెళ్లి మరీ తమ ప్రాణాలను పణంగా పెట్టి రీల్ లు చేస్తున్నారు. కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను సైతం రీల్స్ మోజులో పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అనుకొని ఘటనలు జరుగుతాయి.
వ్యూస్ కోసం చిన్నారి ప్రాణాలతో ఆట.. వీడియో తీస్తుండగానే కంటి పైన పాము కాటు!
▪️ వీడియో తీస్తుండగా చిన్నారిని పాము కంటి పైభాగంలో కరిచిన ఘటన ఆందోళన కలిగిస్తోంది. పాము విషపూరితమైనదా కాదా అనే విషయం స్పష్టంగా తెలియదు.
▪️ వ్యూస్, వైరల్ కోసం చిన్నారులను ఇలాంటి ప్రమాదకర విన్యాసాల్లో… pic.twitter.com/jLK7YdyUSG— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) September 29, 2026
తాజాగా.. ఒక వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది. దీనిలో ఒక బాలుడు తన చేతిలో పామును పట్టుకున్నాడు. పాపం బుడ్డొడికి కనీసం అది విషపూరితమైన పాము.. అలా పట్టుకొవద్దు, జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సిన పెద్దవాళ్లే అతని చేతిలో పామును ఇచ్చి మరీ రీల్ లను రికార్డు చేశారు.
బాలుడు పామును పట్టుకుని వెళ్తుంటే అది ఒక్కసారిగా అతని కంటిపైన కాటు వేసింది. ఈ ఘటనతో బాలుడు ఉలిక్కిపడ్డాడు. వెంటనే పామును వదిలేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వ్యూస్ కోసం మరీ ఇంత దిగజారాలా..?.. అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.