SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Sonia Gandhi: తొలిచూపులోనే రాజీవ్‌ గాంధీతో లవ్‌లో పడ్డా: సోనియా గాంధీ

Sonia Gandhi Reveals His First Sight Love With Rajiv Gandhi: యుక్త వయస్సులో ఉన్నప్పుడు రాజీవ్‌ గాంధీతో జరిగిన ప్రేమాయణం గురించి కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. తొలి చూపులోనే రాజీవ్‌తో ప్రేమలో పడ్డానని.. అతడే తనకు సరైన జోడీ అని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 24, 2026, 03:50 PM IST | Updated: Oct 24, 2026, 04:01 PM IST
Image Credit: Source: X (Twitter)
Join

Sonia Gandhi Rajiv Gandhi Love Story: తన ఆత్మకథ విడుదల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కీలక విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తన వ్యక్తిగత విషయాలను అందులో ప్రస్తావించారు. త్వరలో విడుదల కానున్న ఆత్మకథకు సంబంధించి వరుసగా వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన భర్త రాజీవ్‌ గాంధీతో తొలి పరిచయం, ప్రేమ, పెళ్లి వరకు దారి తీసిన పరిస్థితులను సోనియా గాంధీ వెల్లడించారు. తాను రాజీవ్‌తో తొలిచూపులోనే ప్రేమలో పడ్డట్లు.. అతడే తనకు సరైనోడు అని నిర్ణయించుకున్నట్లు సోనియా చెప్పుకొచ్చారు.

సోనియా గాంధీ ఆత్మ‌క‌థ 'బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌' పుస్తకం న‌వంబ‌ర్ 10వ తేదీన ఆవిష్క‌ర‌ణ కానుంది. ఈ సందర్భంగా ఆ పుస్తకంలో కీలక విషయాన్ని వీడియో రూపంలో సోనియా పంచుకున్నారు. 'ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీలో రాజీవ్ గాంధీ చ‌దువుకున్నాం. ఆ వ‌ర్సిటీలో ఉన్న గ్రీక్ రెస్టారెంట్‌లో రాజీవ్ గాంధీతో నా ప్రేమ ప్ర‌యాణం ప్రారంభమైంది' అని తెలిపారు. గ్రీక్‌ రెస్టారెంట్‌లో కొందరి మిత్రుల ద్వారా రాజీవ్ గాంధీతో పరిచయం జరిగిందని చెప్పారు.

'ఆ రోజుల్లో ఇంగ్లండ్‌లో ఆహారం బాగుండేది కాదు. అందుకే తాను ఇటాలియ‌న్ ఫుడ్ కోసం గ్రీకు రెస్టారెంట్‌కు వెళ్లా. అక్కడ యురోపియ‌న్ స్టూడెంట్స్‌తో పాటు ఇండియ‌న్ విద్యార్థులు కూడా ఆ రెస్టారెంట్‌కు వ‌చ్చేవారు. ఆ రెస్టారెంట్‌లోనే రాజీవ్‌ గాంధీతో ప‌రిచ‌యమైంది. రాజీవ్‌ను చూడ‌గానే నా జీవిత‌ భాగ‌స్వామి దొరికిన‌ట్లు భావించా. రాజీవ్‌ గాంధీ కూడా నాపై అదే అభిప్రాయం క‌లిగి ఉ‌న్నారు' అని సోనియా గాంధీ వివరించారు.

'మొద‌టిసారి ఓ స్నేహితుడి ద్వారా రాజీవ్‌ పరిచయం కాగా.. తర్వాత మేం స్నేహితుల‌మ‌య్యాం. ఫ్రెండ్స్‌తో క‌లిసి పార్టీల‌కు వెళ్లేవాళ్లం. స్టూడెంట్స్‌తో క‌లిసి ఓసారి వాలెంటైన్ పార్టీకి కూడా వెళ్లాం. రాజీవ్ గాంధీ సున్నిత మ‌నస్త‌త్వం నన్ను ఆక‌ర్షించేది' అని సోనియా తెలిపారు. ఆ పరిచయం, ప్రేమ కాస్తా 1968 ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన పెళ్లిగా మారింది. సోనియా, రాజీవ్‌ గాంధీ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రేమ కథ చెప్పడమే కాకుండా రాజీవ్‌తో తాను తీసుకున్న ఫొటోలను కూడా సోనియా గాంధీ తన ఆత్మకథలో పంచుకున్నారు. కాగా తన ఆత్మకథ కోసం సోనియా గాంధీ సోషల్‌ మీడియాలోకి ప్రవేశించారు. ఇన్‌స్టాగ్రామ్‌ను ఇటీవల ప్రారంభించగా.. కాంగ్రెస్‌ నాయకుల నుంచి పెద్ద ఎత్తున ఆమెకు స్వాగత పలుకుతూ ఫాలోవర్లు పెరిగారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES