SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పటాకుల బ్యాన్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు.. మతానికి, టపాసులకు ముడిపెట్టొద్దు.. అసలు సంబంధమేంటన్న ధర్మాసనం!

Supreme Court: దేశ రాజధాని ఢిల్లీ-ఎన్ సీఆర్ ప్రాంతాల్లో పెరుగుతున్న వాయు కాలుష్య పరిస్థితులపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారించిన సుప్రీం.. విచారణ సందర్భంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 13, 2026, 08:51 AM IST | Updated: Oct 13, 2026, 08:53 AM IST
Image Credit: Supreme Court
Join

Supreme Court: దేశ రాజధాని ఢిల్లీ-ఎన్ సీఆర్ ప్రాంతాల్లో పెరుగుతున్న వాయు కాలుష్య పరిస్థితులపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారించిన సుప్రీం.. విచారణ సందర్భంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీపావళి సంబురాల్లో పటాకులు కాల్చడానికి.. మత విశ్వాసాలకు అసలు సంబంధమేంటని ధర్మాసనం నిలదీసింది. పూర్తిగా నిషేధం విధించడం కంటే ప్రజారోగ్యం, సంప్రదాయాల మధ్య సమతుల్యత పాటించడం ముఖ్యమని సుప్రీం అభిప్రాయపడింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. గాలి కాలుష్యం వల్ల పిల్లలు, పెద్దలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ కోర్టు ముందుకు తెచ్చారు. ఈ సమయంలో జస్టిస్ బాగ్చి జోక్యం చేసుకున్నారు. టపాసులు పేల్చడంలో మతపరమైన కోణం ఎక్కడుంది? అని సూటిగా ప్రశ్నించారు. దీనిపై అమికస్ క్యూరీ స్పందించారు. తమ పేరుతో పిల్లలు అనారోగ్యానికి గురువుతున్నారని తెలిస్తే దేవుళ్లు కూడా ఆశ్చర్యపోతారని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. మేము మతపరమైన మనోభావాలను దెబ్బతీయాలనుకోవడం లేదు. కానీ ప్రజలే స్వచ్చందంగా ముందుకు వచ్చి సురక్షిత పద్దతులను ఎంచుకోవాల్సి ఉంటుంది. సమతుల్య విధానం అనేది అవసరం అని అన్నారు. ప్రమాదకరమైన టపాసులు అమ్మకాలను నియంత్రించి.. స్పార్ల్కర్లు, దీపాలు వెలిగించే సంస్క్రతిని ప్రోత్సహించాలని సూచించారు.

ఈ విచారణలో పంట వ్యర్థాల దహనం అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రాలు పంట వ్యర్థాలను కొనుగోలు చేసి.. వాణిజ్యపరంగా ఉపయోగించుకునేందుకు ఒక మార్కెట్ వేదిక అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ అంశంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. తర్వాత విచారణను ధర్మాసనం అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది.


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES