SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రాతి స్తంభంపై కార్తీక దీపారాధన విషయంలో విజయ్ సర్కార్ విఫలం..!!

Tirupparankundram Karthika Deepam: భక్తుల విశ్వాసానికి ప్రతీక… మధురై పుణ్యక్షేత్రం సమీపంలోని పవిత్రకొండపై కార్తీక దీపారాధన వివాదాస్పదమైంది. తమిళనాడు హైకోర్టు....ఆ తర్వాత సుప్రీంకోర్టు మెట్లెక్కిన కార్తీక దీపారాధన కేసు.. సామరస్యపూర్వకంగా వివాదం సద్ధుమణిగేలా తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతరుచేయని తమిళనాడు ప్రభుత్వం సంస్కృతి, సాంప్రదాయాలను తుంగలో తొక్కిందని రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. తమిళనాడులో టీవీకే సర్కార్ భక్తుల విశ్వాసాలను దెబ్బతీసిందని మెజారిటీ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ తమిళనాడు తిరుప్పరంకుండ్రంపై కార్తీక దీపం ప్రత్యేకత ఏంటి? దీపారాధనలో వివాదం ఎందుకు వచ్చింది? ప్రభుత్వం ఏంచేసింది? రాజకీయ పార్టీల రాద్ధాంతమేంటి?

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 25, 2026, 18:21 IST | Updated: Nov 25, 2026, 18:22 IST
Image Credit: Vijay Sarkar Karthika Deepam (Source/ZEE News)
Join

Tamil Nadu Karthika Deepam: తమిళ నాడులోని మధురై పుణ్యక్షేత్ర సమీపంలో ఉన్న పవిత్రకొండ ప్రాంతం. కొండగుహల్లో కొలువుదీరిన సుబ్రహ్మణ్యస్వామి దివ్యసన్నిధి. ఈ ప్రధాన గుహాలయంలో సుబ్రహ్మణ్య స్వామితో పాటు శివుడు  పరంగిరినాథర్ గా పూజలు అందుకుంటున్నారు. శివాలయానికి ఎదురుగా విష్ణువు, వినాయకుడు, దుర్గాదేవి కొలువై ఉన్నారు. కొండప్రాంత శివకేశవులు ఎదురెదురుగా కొలువుదీరిన అరుదైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.

తిరుప్పరం కుండ్రం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఇక్కడ కొండపై సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉన్న తిరుప్పరంకుండ్రం పక్కనే  ముస్లింలకు చెందిన సికందర్ బాదుషా దర్గా ఉంది. ఈ క్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులు వస్తుంటారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న ఉచ్చిపిళ్లయార్ కోయిల్ కు 50 అడుగుల దూరంలో రాతి స్తంభం ఉంది. ఈ రాతిస్తంభంపై కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించి ఆరాధించడం ఆనవాయితీగా వస్తోందిన హిందూ సంఘాలంటున్నాయి.

మధురై సమీపంలో తిరుప్పరం కుండ్రం దేవస్థానం..
తిరుప్పరంకుండ్రం కొండపై  దీపతూన్ అనే పురాతన రాతి స్తంభంపై కార్తీక దీపం వెలిగించే విషయంలో తలెత్తిన భిన్నాభిప్రాయాలు, కొండపై యాజమాన్య హక్కుల వివాదమే ఈ ఉద్రిక్తతలకు దారితీశాయి. కాలక్రమంలో కొండపై యాజమాన్య హక్కుల వివాదం చోటుచేసుకుంది. ఉచ్చిపిళ్లయార్ కోయిల్ సమీపంలో ఉన్న రాతిస్తంభంపై యాజమాన్యహక్కులు వివాదాస్పదమయ్యాయి. సికందర్ బాదుషా దర్గాకు చెందిందని కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో రాతి స్తంభంపై దీపారాధనకు ఆటంకాలు చోటుచేసుకున్నాయి.  ప్రతి కార్తీక పౌర్ణమిరోజున కార్తీక దీపాన్ని వెలిగించే అంశం చర్చనీయాంశమైంది.

రాతిస్తంభంపై కార్తీక దీపం వెలిగించాలని హిందూ సంఘాలు పట్టుబట్టాయి. దేవస్థాన యాజమాన్యం, ఆలయట్రస్టు సభ్యులు మాత్రం ఉచ్చిపిళ్లయార్ కోయిల్ ఆవరణలోనే పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు. రాజకీయ నాయకులు సైతం దీపతూన్ పై దీపారాధన విషయాన్ని సున్నితమైందిగా భావించారు. హిందూ సంఘాల పట్టుతో కేసు కోర్టు మెట్లెక్కింది.

ఆలయ సమీపంలో ఉన్న దీపతూన్ పై సర్వాధికారాలు హిందూ ఆలయాలకే ఉన్నాయని హిందూ సంఘాలు పట్టుబట్టాయి. ఎట్టిపరిస్థితుల్లో దీపస్తంభంపై కార్తీక దీపారాధన చేసితీరుతామని హిందూ సంఘాలు ప్రకటించాయి. పవిత్ర పర్వదిన సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంటుందని పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాల కేసులను పరిశీలించిన సుప్రీంకోర్టు సున్నితమైన అంశంగా పరిగణించి దీపస్తంభ యాజమాన్య హక్కులను కాపాడుతామని  భరోసా ఇచ్చింది. భక్తుల విశ్వాసాలను దెబ్బతినకుండా పూజాకైంకర్యాలు, దీపారాధన చేసుకోవచ్చని సూచించింది.

నాలుగు దశాబ్ధాలుగా కార్తీక దీపారాధనపై వివాదం..

గత యేడాది హిందూ సంఘాల పట్టింపులు ప్రభుత్వ యంత్రాంగానికి సవాలుగా మారింది. వివాదానికి తావులేకుండా దీపారాధన చేసుకోవాలని తమిళనాడు హైకోర్టు తీర్పుతో కార్తీక దీపారాధనకు ఇబ్బంది లేకుండా జరిగింది. భూ యాజమాన్య హక్కుల విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ యేడాది దీపారాధనపై నీలినీడలు కమ్ముకున్నాయి. భక్తుల విశ్వాసాలను మన్నించిన సుప్రీంకోర్టు.. దీపారాధనను యధేచ్ఛగా చేసుకోవచ్చని, ఇతర మతస్తులను రెచ్చగొట్టేవిధంగా, తక్కువచేసి చూసేధోరణి దూరం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు మెట్లెక్కిన కార్తీక దీపారాధన వివాదం..
తిరుప్పరం కుండ్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు కన్నులపండువగా సాగాయి. సుప్రీంకోర్టు సూచనలు, ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విపక్షాలు మండిపడుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన టీవీకే సర్కార్ రాద్ధాంతం చేస్తోందని టీవీకే-కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. ప్రభుత్వం, తమిళ ప్రజలకు ద్రోహం చేయడమే కాకుండా, మురుగన్ స్వామి భక్తులందరినీ వెన్నుపోటు పొడిచిందన్నారు. వివక్షాపూరితమైన ఈ టీవీకే-కాంగ్రెస్ ప్రభుత్వం, హిందూ భక్తులను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తూ, వారి మనోభావాలను తీవ్రంగా అవమానించిందని బీజేపీ, డీఎంకే నేతలు మండిపడ్డారు. సీఎం జోసెఫ్ విజయ్ నాయకత్వంలోని టీవీకే ప్రభుత్వం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మతపరమైన బుజ్జగింపుల  ద్వారా హిందూ విశ్వాసాలకు విఘాతకల్పిస్తోందనే విమర్శలున్నాయి.

తిరుప్పరం కుండ్రం కొండగుట్టపై కార్తీక దీపారాధన అంశం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. తమిళనాడు ప్రజలు, మురుగన్ స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. కూటమి పార్టీనేతల పక్షపాత వైఖరిని తమిళనాడు ప్రజలు తప్పుబడుతున్నారు. విభజన రాజకీయాలను ఎప్పటికీ మర్చిపోరు, క్షమించరనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అసహనంతో కూడిన ఈ టీవీకే-కాంగ్రెస్ పాలనకు కూడా, డీఎంకేకు పట్టిన గతే పడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

తమిళనాడులో తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వివాదం ముదిరింది. ప్రాచీన రాతి దీప స్తంభంపై కార్తీక దీపం వెలిగించలేదు. అయితే, పాత సంప్రదాయం ప్రకారం కొండపై ఉన్న ఉచ్చి పిళ్లయార్‌ ఆలయ మండపంలోనే దీపాన్ని వెలిగించారు. ఈ పరిణామంపై టీవీకే ప్రభుత్వంపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మురుగన్‌ స్వామి భక్తులకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్‌ కేశవన్ ధ్వజమెత్తారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజలు అందుకుంటున్న మురుగన్ అంటే తమిళనాడు ప్రజానీకానికి ప్రత్యేక భక్తి విశ్వాసం. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, పవిత్రమైన కార్తీక దీపాన్ని దీపత్తూన్‌ దగ్గర వెలిగించకుండా  టీవీకే  సర్కార్ అడ్డుకుందని  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్‌ కేశవన్  ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందూ భక్తుల విషయంలో టీవీకే ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందని.. కోట్లాది మంది ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆయన ఆరోపించారు. భక్తులను, వారి విశ్వాసాలను అవమానించిందని మండిపడ్డారు. వివక్షపూరిత, విభజన రాజకీయాలను తమిళనాడు ప్రజలు, మురుగన్‌ భక్తులు ఎన్నటికీ మర్చిపోరని.. క్షమించరని కేశవన్‌ వ్యాఖ్యానించారు. టీవీకే ప్రభుత్వానికి కూడా డీఎంకేకు పట్టిన గతే పడుతుందని వ్యాఖ్యానించారు.

వివాదం లేకుండా రాతిస్తంభంపై దీపారాధనకు సుప్రీంకోర్టు అనుమతి..
దీప స్తంభంపై ఒక్కరోజు దీపం వెలిగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం సాయంత్రం దీప స్తంభంపై దీపాన్ని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అధికారులు అక్కడ దీపం వెలిగించకపోవడంతో వారంతా నిరాశకు గురయ్యారు. మదురైలో హిందూ సంఘాల సభ్యులు, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో మదురైలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుప్పరంకుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించాలంటూ దశాబ్దాలుగా న్యాయ పోరాటాలు జరుగుతున్నాయి. దీప స్తంభం వద్ద దీపం వెలిగించాలని గత ఏడాది మద్రాసు హైకోర్టు ఆదేశించినా అప్పటి డీఎంకే ప్రభుత్వం ఖాతరు చేయలేదు.  

ఉచ్చిపిళ్లయార్ కోయిల్ రాతిమండపంలోనే కార్తీక దీపారాధన..

హిందూ భక్త సంఘాలు కోరిన విధంగా సుప్రీంకోర్టు సహాయ సహకారాలు అందిస్తే.. దీపారాధనకు అవకాశం కల్పిస్తే... టీవీకే ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీప స్తంభంపై దీపారాధన చేయకుండా, ఉచ్చి పిళ్లయార్ కోయిల్ ఆవరణలో రాతి మండపంలోనే దీపం వెలిగించడం నిరాశపరిచిందని భక్తులు అభిప్రాయపడ్డారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు మండిపడ్డారు. సంప్రదాయబద్ధంగా ఏటా కొండపై ఉన్న ఉచ్చి పిళ్ళైయార్  ఆలయం సమీపంలోని  దీప మండపం లోనే మహాదీపం వెలిగిస్తారని, దీపతూన్ వద్ద దీపం వెలిగించే ఆచారం ఎప్పుడూ లేదని ఆలయ బోర్డు, అధికారులు చెబుతున్నారు.
 
వివాదాలకు దూరంగా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా  తిరుప్పర కుండ్రం కొండపై కార్తీక దీపారాధనకు చర్యలు తీసుకోవాలని సీఎం విజయ్ అధికారులను ఆదేశించించారు. దీంతో తిరుప్పరం కుండ్రం దేవస్థాన అధికారులతో కలసి ప్రభుత్వ అధికారులు ఉచ్చి పిళ్లయార్ గుడిలోనే పూజలు నిర్వహించి, రాతి మండపంలోనే కార్తీక దీపారాధాన చేశారు. సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్తీక దీపారాధనను పూర్తిచేశామని తిరుప్పరం కుండ్రం దేవస్థానాధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు తావులేకుండా, రాతి స్తంభంపైనే కార్తీక దీపారాధన చేసితీరుతామని బీజేపీ నేతలు శపథం చేశారు.

(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సౌజన్యంతో)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES