• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /తిరుపతి
  • /Tirumala Temple: తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రులు

Tirumala Temple: తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రులు

Telangana And Karnataka Deputy CMs Visits To Tirumala Temple: కార్తీక మాసం సందర్భంగా తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని బుధవారం పలువురు ప్రముఖులు సందర్శించారు. వీఐపీ బ్రేక్‌ దర్శనంలో తిరుమల శ్రీవారిని ఎవరెవరు దర్శించుకున్నారో తెలుసుకుందాం.

Written By Ravi Kumar Sargam
Published: Nov 25, 2026, 18:18 IST|Updated: Nov 25, 2026, 18:32 IST
joinshare
Tirumala Temple: తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రులు
Image Credit: Source: Bhatti Vikramarka Twitter (X)

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Tirumala: తిరుమలలో పెను విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన భక్తుడు.. అసలేం జరిగిందంటే..?

Tirumala: తిరుమలలో పెను విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన భక్తుడు.. అసలేం జరిగిందంటే..?

2

రాతి స్తంభంపై కార్తీక దీపారాధన విషయంలో విజయ్ సర్కార్ విఫలం..!!

3

Tirumala Temple: తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రులు

4

ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టనున్న OnePlus కొత్త ఫోన్.. 9000mAh బ్యాటరీతో అదరగొట్టే ఫీచర్లు!

5

ఉదయం కల్లు గీత.. ఆ తర్వాత స్కూల్.. తండ్రి లేని లోటును భర్తీ చేస్తున్న చిన్నారి చరణ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bhatti Vikramarka In Tirumala: కార్తీక మాసం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గిపోయింది. స్వామిని దర్శించుకునే భక్తులు తగ్గిపోవడంతో తిరుమలలో రద్దీ లేదు. భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో తిరుమలలో సందడి లేదు. అయితే స్వామిని దర్శించుకునేందుకు మాత్రం ప్రముఖులు తరలివచ్చారు. ఒకే రోజు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఉప ముఖ్యమంత్రులతోపాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖుల దర్శనం
తిరుమల శ్రీవారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తమ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వేర్వేరుగా తిరుమలకు చేరుకున్న ప్రముఖులు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం పొందారు.

స్వల్ప రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా ఉంది. మంగళవారం స్వామివారిని 59,413 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,015 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు లభించింద. 3.18 లక్షల లడ్డూ విక్రయాలు జరగ్గా.. అన్నప్రసాదం 1.68 లక్షల మంది భక్తులు స్వీకరించారు. అశ్విని ఆసుపత్రిలో 2,242 మంది భక్తులు వైద్య సేవలు పొందారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే కంపార్ట్‌మెంట్లు 23 నిండిపోయి ఉండగా.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు దర్శన సమయం సుమారు 12 గంటలు పడుతోంది.

కాణిపాకంలో గ్రామోత్సవం
కార్తీక పౌర్ణమి సందర్భంగా కాణిపాకంలో శివపార్వతుల గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాత్రి శివపార్వతుల గ్రామోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామివారి గ్రామోత్సవం భక్తులను ఆకట్టుకుంది. గ్రామోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివపార్వతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ రోజు కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, ఆ కలియుగ దైవం ఆశీస్సులు పొందడం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని, మనశ్శాంతిని ఇచ్చింది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఆ శ్రీనివాసుడి దివ్య ఆశీస్సులు మన రాష్ట్రంపై, మన ప్రజల భవిష్యత్తుపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించాను. గోవిందా... గోవిందా.

— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) November 25, 2026

చొక్కాణి మహోత్సవం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో చొక్కాణి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహానంది సమీపంలోని చొక్కాణి మాను వద్ద పవిత్ర దీపాలను వెలిగించి అగ్నిప్రజ్వలన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ అరుదైన సంప్రదాయ వేడుకను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. శివనామస్మరణతో ముక్కంటి ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Tirumala
Spirituality
AP News
Telugu News