• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /Tirumala Fog: పొగమంచు కనువిందు.. మేఘాలతో ఇల వైకుంఠంగా మారిన తిరుమల

Tirumala Fog: పొగమంచు కనువిందు.. మేఘాలతో ఇల వైకుంఠంగా మారిన తిరుమల

Beautiful Weather With Fog In Tirumala Temple: మంచు కౌగిలిలో తిరుమల ఆలయం మునిగిపోయింది. శీతాకాలం కావడంతో పొగ మంచు కమ్ముకుని తిరుమల పరిసరాలు కొత్త అందంతో నిండిపోయాయి. మంచు కౌగిలిలో తిరుమల ఆలయం, ఏడు కొండలు మునిగిపోయాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 25, 2026, 18:46 IST|Updated: Nov 25, 2026, 18:52 IST
joinshare
Tirumala Fog: పొగమంచు కనువిందు.. మేఘాలతో ఇల వైకుంఠంగా మారిన తిరుమల
Image Credit: Tirumala Fog

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Tirumala Fog: పొగమంచు కనువిందు.. మేఘాలతో ఇల వైకుంఠంగా మారిన తిరుమల

Tirumala Fog: పొగమంచు కనువిందు.. మేఘాలతో ఇల వైకుంఠంగా మారిన తిరుమల

2

Tirumala: తిరుమలలో పెను విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన భక్తుడు.. అసలేం జరిగిందంటే..?

3

రాతి స్తంభంపై కార్తీక దీపారాధన విషయంలో విజయ్ సర్కార్ విఫలం..!!

4

Tirumala Temple: తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రులు

5

ఛార్జింగ్ టెన్షన్‌కు చెక్ పెట్టనున్న OnePlus కొత్త ఫోన్.. 9000mAh బ్యాటరీతో అదరగొట్టే ఫీచర్లు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tirumala Temple: కలియుగ దైవం వెంకటేశ్వరుడు వైకుంఠంలో కొలువుదీరినట్టు మేఘాలు తిరుమల ఆలయం చుట్టూ కమ్ముకున్నాయి. మంచు దుప్పటిలో తిరుమల పరిసరాలు నిండిపోయాయి. శీతాకాలం తిరుమల కొండలు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏడు కొండలు మంచు కౌగిలిలో మునిగిపోయాయి. పొగమంచు కమ్మకోవడంతో సప్త గిరులు మంచుకొండలుగా మారిపోయాయి. ఈ సందర్భంగా తిరుమల విశేషాలు ఇలా ఉన్నాయి.

కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల కొండ శీతాకాలం సరికొత్త అందాలతో కనిపిస్తోంది. చలికాలం ఉష్ణోగ్రతలు పడిపోగా.. చలి తీవ్రతతో మేఘాలు కిందకు వచ్చేశాయి. దట్టమైన పొగమంచు కమ్ముకుని తిరుమల కొండలు సరికొత్త అందాలు సంతరించుకున్నాయి. ఘాట్ రోడ్డుతో పాటు తిరుమల కొండలను దట్టమైన పొగమంచులో మునిగిపోయాయి. మేఘాలు కింద నుంచి వెళ్లిపోతుండడంతో భక్తులు సరికొత్త ఆనందాన్ని పొందారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెల్లవారుజామున ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో తిరుమల ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. పొగమంచు తెరల మధ్య ఘాట్ రోడ్డు, కొండలు ఆకట్టుకున్నాయి. సినిమాల్లో చూపించినట్టు తిరుమల కొండలు మంచు కొండలుగా మారిపోయాయి. ఆధ్యాత్మిక నగరి సరికొత్త అందాలతో దర్శనమిస్తోంది. మంచు అందాలతో తిరుమల ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు పొగమంచు మధ్య కొండల అందాలు కనువిందు చేస్తున్నాయి..

ఎత్తైన కొండలు, పచ్చని అడవులను మంచు కమ్మేయడంతో తిరుమల పరిసరాలు మరింత ఆహ్లాదకరంగా మారాయి. దట్టమైన పొగమంచు మధ్య ప్రకృతి అందాలను వీక్షిస్తూ భక్తులు, పర్యాటకులు మంత్రముగ్ధులవుతున్నారు. తెల్లవారుజామున తిరుమలలో నెలకొన్న ఈ వాతావరణం ఆధ్యాత్మిక శోభకు ప్రకృతి అందాలను జోడిస్తోంది.. పొగమంచు కప్పేసిన తిరుమల ఘాట్ రోడ్డు దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Tirumala
AP Weather
Weather Update
Spirituality
Telugu News