SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

YouTuber Madhumita Video: చోరీ జరిగిన తగ్గెదెలా అంటున్న యూట్యూబర్ మధుమిత.. మళ్లీ డబ్బుల కట్టలతో కొత్త వీడియో..

Madhumitha House Robbery row: ఇప్పటికే దొంగలు ఇంట్లో పడి కోట్లాది రూపాయలు చోరీ చేశారు. అయిన తమిళనాడుకు చెందిన లేడీ యూట్యుబర్ మరోసారి రెచ్చిపోయింది. ఈ వీడియో వైరల్ గా మారింది.

Written By Inamdar Paresh
Published: Sep 29, 2026, 01:52 PM IST | Updated: Sep 29, 2026, 01:58 PM IST
Image Credit: madhumitayoutubertamilnaduvideo
Join

YouTuber Madhumita again continues dance with money video: ఇటీవల చాలా మంది సోషల్ మీడియాలో ఏదైన చేసేందుకు అస్సలు వెనుకాడటం లేదు. అంతిమంగా వ్యూస్ ,ఫాలోవింగ్ ను పెంచుకొవడమే టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. కొన్నిసార్లు వీరు చేసే వెర్రి పనుల వల్ల లేని సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. మరికొన్నిసార్లు వారి ప్రాణాలను సైతం రిస్క్ లో వేసుకుంటున్నారు. ఇటీవల తమిళనాడుకు చెందిన లేడీ య్యూబర్ తన ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులతో రీల్ లు తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్ కావడంతో మధుమిత ఇంట్లో 118 సవర్ల బంగారు నగలు, డబ్బులు  చోరీ అయ్యింది. 

 

 

కొంత మంది కేటుగాళ్లు మధుమిత ఇంట్లో భారీ దొంగతనంకు పాల్పడ్డారు. ఆ తర్వాత దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు టెక్నాలసీ సాయంతో నిందితులను గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆమెను నెట్టింట కొంత మంది ఏకీపారేస్తుండగా, మరికొంత మంది మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. ఈ రచ్చ నడుస్తుండగానే మధుమిత ఇన్ స్టాలో మరో వీడియో రిలీజ్ చేసింది.

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ సమీపంలోని తమ్మట్టుకోణంలో యూట్యూబర్, ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన మధుమిత (29),  వినోద్ కుమార్ భార్యభర్తలు. వీరికి రెండేళ్ల పాప ఉంది. అయితే.. ఇటీవల ఇంట్లో కోట్లాది రూపాయలు చోరీ అయిన గంటల వ్యవధిలోనే పది వరకు రీల్ లు తీయడం , అది కూడా డబ్బుల కట్టలతో  చేయడం ప్రస్తుతం నెట్టింట రచ్చగా మారింది.  తనతలపై, పాప తలపై డబ్బు కట్టలు పోసుకుని డ్యాన్స్ చేయడం, నోట్లను గాల్లోకి చల్లడం వంటివి చేస్తు.. "ఏదీ శాశ్వతం కాదు" అనే క్యాప్షన్‌తో వీడియోను పంచుకుంది.  

ఇది కాస్త నిముషాల వ్యవధిలోనే వైరల్ గా మారాయి. దీనికి 40 గంటల్లో ఒక వీడియోకు 39 లక్షల వ్యూస్ రాగా, మిగిలిన వీడియోలతో కలిపి మొత్తం 1.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. అదే విధంగా మధుమిత  ఫాలోవర్ల సంఖ్య కూడా 5 లక్షలకు పెరిగింది. చోరీ జరిగిన ఈ వీడియోలు ఏంటని కొంత మంది నెటిజన్లు మధుమితను ఏకీపారేస్తుండగా, మరికొంత మంది మాత్రం..అసలు అవి నిజమైనవా?. లేదా ఫెక్ నోట్లా అంటూ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES