Lion Bathing Video: సాధారణంగా అడవికి రాజు అయిన సింహం పేరు వింటేనే ప్రతి ఒక్కరి వెన్నులో మనకు పుడుతూ ఉంటుంది. జూ పార్కుల్లో లేదా అడవుల్లో దట్టమైన ఇనుపకంచెల వెనుక నుంచి సింహాన్ని చూసేందుకే జనం వనికిపోతూ ఉంటారు. అలాంటిది ఏకంగా ఒక సింహం పక్కనే నిలబడి.. దానికి నీళ్లతో స్నానం చేయిస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికే భయమేసే ఇలాంటి అరుదైన అత్యంత సాహసోపేతమైన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో.. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు ఏమాత్రం భయం లేకుండా సింహానికి అతి దగ్గరలో ఉండడం మీరు చూడొచ్చు. చేతిలో వాటర్ పైపు పట్టుకొని.. పెంపుడు కుక్కకో లేదా ఒక దూడకు స్నానం చేయించినంత సహజంగా సింహానికి నీళ్లు చల్లుతూ ఉండడం మీరు చూడొచ్చు.. పైపులు నీటి దారాల నుంచి సింహం శరీరం పైకి వదులుతూ.. మరో చేతితో దాని ఒంటిని.. నెత్తి మీద జూలును ప్రేమగా దువ్వుతూ శుభ్రం చేయడం మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. ఏ క్షణంలోనైనా సింహం దాడి చేస్తుందేమోనన్న భయం ఆ యువకుడిలో కనిపించడం మీరు గమనించవచ్చు..
ఈ వీడియోలో యువకుడి ధైర్యం ఒక ఎత్తైతే.. ఆ సింహం స్పందించిన తీరు మరో ఎత్తు.. సాధారణంగా క్రూర జంతువులు నీటిని తాకినప్పుడు ఏదోలా ఫీలవుతూ ఉంటాయి.. అంతేకాకుండా అప్పుడప్పుడు విరుచుకుపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం సింహం చాలా ప్రశాంతంగా.. హాయిగా నిలబడి స్నానాన్ని ఆస్వాదించడం మీరు క్లియర్ గా చూడొచ్చు. యువకుడు ఆ సింహం జుట్టును చేతులతో రాస్తుంటే.. అది ఎలాంటి కోపం చూపించకుండా పూర్తిగా రిలాక్స్ అవ్వడం మీరు చూడొచ్చు. దీన్నిబట్టి ఆ యువకుడికి.. ఆ సింహానికి మధ్య ఉన్న సానిహిత్యం ఏంటనేది తెలుస్తోంది..
ఈ వింత వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్‌లో ప్రత్యక్షమైన కొద్ది రోజుల్లోనే విపరీతమైన వ్యూస్ను సంపాదించుకుంది. అంతేకాకుండా వేలాదిలైకులతో దూసుకెళ్తోంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు తమదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. బ్రదర్ నువ్వు నిజమైన డేర్ డెవిల్ అంటూ కామెంట్లు పెడుతుంటే.. కొంతమంది సింహాన్ని ఇంట్లోని పిల్లిలా చూస్తున్నట్లు అనిపిస్తుందని కామెంట్లు రాస్కొస్తున్నారు. గుండె ధైర్యం అంటే నీది భయ్యా అంటూ మరికొంతమంది సరదాగా కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూ వస్తుంది..