Rajasthan: అయ్యో.. రూ. 20 కచోరీ తింటుంటే.. ఏకంగా 20 లక్షల బ్యాగ్‌తో దొంగలు పరార్.. వీడియో వైరల్..
Rs 20 lakhs bag steals in Jaipur: చంపాలాల్ అనే వ్యాపారి ఆకలిగా ఉందని కచోరీ కోసం ఆగాడు. ఇద్దరు ఆగంతకులు స్కూటీ మీద వచ్చి ఒక బ్యాగ్ ను తీసుకుని రెప్పపాటులో మాయమయ్యారు. జైపూర్ లో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.
Thieves steals rs 20 lakhs while man eating kachori in Jaipur: ఇటీవల చాలా మంది ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం ఎలాంటి పనులకైన వెనుకాడటంలేదు. కొంత మంది సోషల్ మీడియాలో మోసాలు చేస్తున్నారు. మరికొంత మంది బంగారం,డబ్బులు చోరీలకు పాల్పడుతున్నారు. ఇంకొన్ని చోట్ల దుకాణాల్లో కస్టమర్లుగా వెళ్లి మరీ సీక్రెట్ గా బట్టలు, నగల్ని కాజేస్తున్నారు. ఈ క్రమంలో రోడ్లపై, బ్యాంక్ ల వద్ద కొంత మంది ఆగంతకులు రెడీగా ఉంటారు. ఏ మాత్రం నెగ్లీజెన్సీగా ఉన్న కూడా వెంటనే చోరీలకు పాల్పడుతుంటారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన జైపూర్ లో చోటు చేసుకుంది.
రాజస్తాన్ లోని జైపూర్ లో చంపలాల్ అనే వ్యాపారి ప్రతిరోజులాగే వివిధ దుకాణాల నుంచి డబ్బులను కలెక్ట్ చేసి వెళ్తున్నాడు. అతని బ్యాగ్ లో 20 లక్షల రూపాయల ఉన్నాయి. అయితే.. పాపం చంపలాల్ కు ఆకలి వేయడంతో ఒక దుకాణం వద్ద తన స్కూటిని ఆపాడు. ఆ తర్వాత రూ. 20 పెట్టి కచోరీ తీసుకుని తింటున్నాడు. ఇంతలో ఇద్దరు ఆగంతకులు హెల్మెట్ వేసుకుని అక్కడకు వచ్చారు.
చంపలాల్ ను ఫాలో అయ్యి ఆయన కచోరీ తినడంను దూరంనుంచి గమనించారు. వెంటనే ఆయన స్కూటీ వద్దకు వెళ్లి ఏదో ఫోన్ చూస్తున్నట్లు చేసి పక్కన ఉన్న స్కూటీ మీద పెట్టిన రూ. 20 లక్షల బ్యాగ్ ను రెప్పపాటులో తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ కు గురైన వ్యాపారి చంపాలాల్ స్కూటీ మీద నుంచి దిగి గట్టిగా అరుస్తు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
కానీ వారు హెల్మెట్లు పెట్టుకుని ఉన్నారు. అక్కడినుంచి వెంటనే స్పీడ్ గా వెళ్లిపోయారు. వెంటనే వ్యాపారి చంపాలాల్ వెంటనే నహర్‌గఢ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ ప్రదేశంలోని సీసీ కెమెరాను పరిశీలించారు. దానిలో దొంగల కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. అయితే వారు హెల్మెట్ పెట్టుకొవడం వల్ల వారి ముఖాలు మాత్రం రివీల్ కాలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.