• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /AP School Holiday: అర్నబ్ తుపాన్ బీభత్సం.. ఏపీలోని 10 జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవులు.!.

AP School Holiday: అర్నబ్ తుపాన్ బీభత్సం.. ఏపీలోని 10 జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవులు.!.

Arnab effect in ap: అర్నాబ్ తుపాన్ బలహీనపడింది. మరోవైపు ఏపీలో రానున్న వారం రోజుల పాటు ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో అధికారులు పలు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవుల్ని ప్రకటించారు.

Written ByInamdar Paresh
Published: Oct 28, 2026, 08:45 PM IST|Updated: Oct 28, 2026, 09:01 PM IST
joinshare
AP School Holiday: అర్నబ్ తుపాన్ బీభత్సం.. ఏపీలోని 10 జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవులు.!.
Image Credit: arnab cyclone effect

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Baby Arnab: తుపాన్ వేళ జన్మించిన శిశువు.. అర్నాబ్‌గా నామకరణం.. ఎక్కడంటే..?..

Baby Arnab: తుపాన్ వేళ జన్మించిన శిశువు.. అర్నాబ్‌గా నామకరణం.. ఎక్కడంటే..?..

2

AP School Holiday: అర్నబ్ తుపాన్ బీభత్సం.. ఏపీలోని 10 జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవులు.!.

3

Trivikram Srinidhi Shetty: హీరోయిన్ శ్రీనిధి కాళ్లు మొక్కబోయిన డైరెక్టర్ త్రివిక్రమ్..'ఆదర్శ కుటుంబం' వేడుకలో ఆసక్తికర ఘటన!

4

PM Modi Congress MLC Polls: 4 రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ..సోషల్ మీడియాలో దారుణంగా ప్రధాని మోదీ ట్రోలింగ్!

5

Prabhu Deva: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా ప్రభుదేవా, సిమ్రాన్.. ‘కమల్ శ్రీదేవి’తో సందడి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

School declared holiday in these district in ap due to arnab cyclone: అర్నబ్ తుపాన్ ఏపీని అతలాకుతలం చేసింది. ఈ క్రమంలో ఏపీలో అనేక జిల్లాలు వరద ప్రభావంకు చిగురుటాకుల్లా వణికిపోయాయి. బలమైన ఈదురు గాలులతో రోడ్లపై చెట్లన్ని కూలీపోయాయి.  పలు చోట్ల కరెంట్ స్తంభాలన్ని  నెలకూలాయి. సామాన్య జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది.  సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రౌండ్ లెవల్ లో ఉండి సహాయక చర్యల్లో అప్రమత్తంగా  ఉండాలన్నారు. మరోవైపు అర్నాబ్ తుపాన్ యానాంకు నైరుతి దిశలో నరసాపురానికి సమీపంలో  తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

రానున్న ఏడు రోజుల పాటుకూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు దంచి కొడతున్నాయి. తీరంవెంబడి గంటకు  110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ  శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఏపీలోని మరో వారం పాటు వర్షాలు అలర్ట్ నేపథ్యంలో అధికారులు పది జిల్లాలకు స్కూళ్లకు సెలవుల్ని ప్రకటించారు.

అర్నాబ్ నేపథ్యంలో.. అక్టోబరు 29న గురువారం రోజున పది జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవుల్ని ప్రకటిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. విజయ నగరం, అల్లూరి సీతారామారాజు, ఏలూరు, పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ,కృష్ణ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవుల్ని ప్రకటిస్తు ఉత్తర్వులు జారీ చేశారు.

అర్నబ్ బాధితులకు ప్యాకేజీ ప్రకటన..

అర్నబ్ తుపాన్  బాధితులకు ఏపీ సీఎం చంద్రబాబు భారీ ప్యాకేజీ ప్రకటించారు. తుపాన్ వల్ల ఇళ్లలోనికి నీళ్లు చేరిన కుటుంబాలకు 25 కేజీల బియ్యం, మత్స్యకారులు మరియు చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం, ప్రతి కుటుంబానికి కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ చక్కెర, కేజీ బంగాళదుంపలు ఉచితంగా పంపిణి చేస్తామని ప్రకటించారు. 

తక్షణ ఖర్చుల కోసం ప్రతి ఒక్క కుటుంబానికి రూ. 1000 నుంచి గరిష్టంగా రూ. 3000 వరకు ఆర్థిక సాయం ప్రకటించారు. తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, పాక్షికంగా ఇల్లు దెబ్బతింటే రూ. 10,000 ఆర్థిక సహాయంను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
AP News
School Holiday
Rain News