SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Video Viral: తగ్గెదెలా.. పుట్ పాత్‌పై బైకర్లకు చుక్కలు చూపించిన ముగ్గురు అమ్మాయిలు.. వీడియోపై ప్రశంసలు..

Three girl on foot path Video: ట్రాఫిక్ నియమాల్ని పాటించకుండా ఫుట్ పాత్ మీద వెళ్తున్న బైకర్లకు ముగ్గురు అమ్మాయిలు చుక్కలు చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written By Inamdar Paresh
Published: Nov 22, 2026, 15:12 IST | Updated: Nov 22, 2026, 17:13 IST
Image Credit: Three women on footpath video
Join

Three girls stopped people riding bikes on footpath video: సోషల్ మీడియాలో ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేసేవిలా ఉంటాయి. మొత్తంగా  కొన్ని మనచుట్టు జరిగే చాలా ఆలోచింప చేసేవిలా కూడా ఉంటాయి. ఈ క్రమంలో  రోడ్డుపైన ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ నియమాల్ని పాటించాలని పోలీసులు తరచుగా చెప్తుంటారు. కానీ కొంత మంది మాత్రం పూర్తిగా నెగ్లీజెన్సీగా తమ వాహనాల్ని నడిపిస్తారు. వారు ప్రమాదంలో పడటం మాత్రమే కాకుండా ఇతరుల్ని కూడా డెంజర్ లో పడేస్తుంటారు. 

 

 

ఈ క్రమంలో  రోడ్డు మీద ట్రాఫిక్ ఫుల్గా ఉన్నప్పుడు ముఖ్యంగా టూవీలర్ వాహన దారులు తమ వాహనాల్ని ఫుట్ పాత్ లను ఆక్రమించి వాటి గుండా  ముందుకు వెళ్తారు. నడకు మార్గంలో వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కల్గజేస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఇలాంటి ట్రాఫిక్ నియమాల్ని ఉల్లంఘిస్తున్న బైకర్లకు ముగ్గురు అమ్మాయిలు చుక్కలు చూపించారు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో ముగ్గురు అమ్మాయిలు పుట్ పాత్ గుండా వెళ్తున్నారు. వీరి వెనుకాల టూవీలర్ వాహనదారులు వస్తున్నారు. ఫుట్ పాత్ లను కేవలం నడక మార్గం వారి కోసం మాత్రమే కేటాయించిన విషయం తెలిసిందే.  

అయిన కూడా బైకర్ లు ఆ మార్గంలో రావడంపై అమ్మాయిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు సైడ్ ఇవ్వాలని ఎంతగా హరన్ కొట్టిన కూడా వారు అస్సలు పక్కకు తప్పుకోలేదు. తమకేం అన్నట్లు వాళ్ల మార్గంలో వాళ్లు వెళ్లారు. ఈ ఘటనను కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ముగ్గురు అమ్మాయిలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES