Tvk mla vs babu passed away by cardiac arrest: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టీవీకే పార్టీ ఎమ్మెల్యే వీకే బాబు కాసేపటి క్రితం కన్నుమూశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం స్టాలీన్ ను కొళత్తూర్ నియోజకవర్గం నుంచి 82,997 ఓట్లతో తేడాతో ఓడించి ఒక రేంజ్ హిస్టరీ క్రియేట్ చేశారు. గత కొన్ని రోజులుగా వీకే బాబు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు.
ఇటీవల ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు.ఈ క్రమంలో చికిత్స పొందుతూ కాసేపటి వీకే బాబు కన్నుమూశారు. ఈ ఘటన తమిళనాడు తీవ్ర విషాదకరంగా మారింది. దీనిపై టీవీకే నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. స్టాలీన్ ను తనదైన స్టైల్ లో ట్రోల్ చేస్తు అప్పట్లో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారారు.
ఇక వీకే బాబు రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. 2006: DMK పార్టీ తరఫున పురసైవాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరల 2016 లో ఏఐఏడీఎంకే పార్టీలో వీకే బాబు చేరారు. ఆ తర్వాత 2026 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ నుంచి కొళత్తూరు నుంచి బరిలోకి దిగారు.
కొళత్తూరులో ఎం.కె. స్టాలిన్‌పై 82,997 ఓట్లతో మాస్ విజయంను సాధించిన విషయం తెలిసిందే. వీకే బాబు మృతితో కొళత్తూర్ నియోజక వర్గంకు ఉప ఎన్నిక అనివార్యమైంది. మరోసారి ఈ ఎన్నికల్లో స్టాలీన్ బరిలోకి దిగుతారా..?.. ఒక వేళ బరిలో ఉంటే సిట్యువేషన్ ఏంటని చర్చలు జోరందుకున్నాయి. టీవీకే పార్టీ ఎవర్ని బరిలోకి దింపుతుందని కూడా తమిళనాట జోరుగా చర్చలు జరుగుతున్నాయి.