SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Delhi: ఢిల్లీలో కుప్పకూలిన రెండతస్తుల భవనం.. ఇద్దరు దుర్మరణం.. పలువురికి తీవ్ర గాయాలు..

Delhi building collapse: షహదరా జిల్లాలోని జ్వాలా నగర్ ప్రాంతంలో రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనకలు గురయ్యారు.

Written By Inamdar Paresh
Published: Nov 17, 2026, 12:20 IST | Updated: Nov 17, 2026, 12:38 IST
Image Credit: delhi building collapsed news
Join

Two killed several injured delhi building collapse: దేశ రాజధాని ఢిల్లీలో రెండస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలీంది. షహదరా జిల్లాలోని జ్వాలా నగర్ ప్రాంతంలో  ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద శబ్దం రావడంతో  ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీగా శిథిలాలు  ఆప్రదేశంలో పేరుకుపోయాయి. 

 

 

శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఇద్దరు ఈ  ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో మూడేళ్ల బాలిక, 35 ఏళ్ల మరో వ్యక్తి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు  వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.  సమాచారం అందుకున్న సహయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. చనిపోయిన ఇద్దరిలో ఒక చిన్నారి కూడా ఉంది. గాయపడ్డ వారిని హుటా హుటీన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా  టెన్షన్ వాతావరణం తలెత్తింది. ఘటనపై ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఢిల్లీలో గత కొన్ని నెలలుగా జరిగిన ఘటనలు..

గత కొన్ని నెలలుగా ఢిల్లీలో  వరుస భవనాలు కుప్పకూలడంతో స్థానికులు సైతం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 6న సత్య నికేతన్‌లో పేయింగ్ గెస్ట్ వసతి ఉన్న ఐదు అంతస్తుల భవనం కూలిపోవడంతో విద్యార్థులతో సహా ఏడుగురు మరణించారు. అక్టోబర్ 7న ఉత్తర ఢిల్లీలోని సీమాపురిలో మరో భవనం కూలి నలుగురు మృతి చెందారు. ఆతర్వాత మరల

అక్టోబర్ 25న, ఈశాన్య ఢిల్లీలోని హర్ష్ విహార్‌లోని మిలన్ గార్డెన్‌లో నిర్మాణంలో ఉన్న కట్టడం కూలిపోవడంతో 60 ఏళ్ల చందర్‌పాల్, అతని 33 ఏళ్ల కుమారుడు విజయ్ కుమార్ మృతి చెందారు. నవంబర్ 15న పహర్‌గంజ్‌లో భవనం కూలిన ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.


 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES