SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Snake video: అరెవావ్.. ఆవు మీద ఎక్కి బుసలు కొడుతున్న రెండు నాగు పాములు.. వీడియో వైరల్..

cobra Video viral: ఇంటి ముందుకు ఒక ఆవు వచ్చింది. అయితే దాని మీద రెండు పాములు ఎక్కి కూర్చున్నాయి. అవి బుసలు కొడుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 18, 2026, 11:44 AM IST | Updated: Oct 18, 2026, 11:48 AM IST
Image Credit: snakevideoviral
Join

Two Snakes spotted on cow ai generated video viral: పాముల వీడియోలు సోషల్ మీడియాలో ఇటీవల బాగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఎక్కడ పాములు కన్పించిన వెంటనే చాలా మంది తమఫోన్ లను ఓపెన్ చేసి మరీ కోబ్రాలను రికార్డు చేస్తున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసి వాటిని వైరల్ చేస్తున్నారు. పాముల్ని చూసి ఒకప్పుడు చాలా మంది జనాలు భయపడిపోయే వారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ గా మారింది. కోబ్రాలను చూసి ఎవరి భయపడటంలేదు. అంతే కాకుండా దానితో స్టంట్ లు చేయడం, వీడియోలు రికార్డు చేయడం వంటివి చేస్తున్నారు. పాములతో చాలా  జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.  

 

 

ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న కూడా వాటి కాటుకు బలి కావల్సిందే. పాములు ఇటీవల జనావాసాల్లోకి వస్తున్నాయి. పొదలు ఉన్న చోట, ఎలుకలు ఎక్కువగా ఉంటే అక్కడ కోబ్రాలు సంచరిస్తాయి. కోబ్రాలు కొన్నిసార్లు బూట్లలో, వాహనాల్లో దూరి దాక్కుంటాయి. ఈ క్రమంలో రెండు పాములు ఒక ఆవుమీద ఎక్కి కూర్చున్నాయి. అవి రెండు బుసలు కొడుతున్నాయి.


వైరల్ అవుతున్న వీడియోలో రెండు పాములు కూడా ఆవు మీద ఎక్కి చుట్టుకుని కూర్చున్నాయి. అవి బుసలు కొడుతూ అక్కడి వారికి చుక్కలు చూపిస్తున్నాయి. ఆవు ఒక ఇంటి ముందు వెళ్లింది. రెండు పాములు సైతం ఆవుమీద కన్పించడంతో ఇంట్లోవారు షాక్ అయ్యారు. చాలా సేపటి తర్వాత తెరుకుని పాముల కదలికల్ని రికార్డు చేశారు. ఇది కాస్త నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. 

కొంత మంది దీన్ని ఏఐతో చేసిన వీడియో అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇటీవల ఏఐతో వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీని వల్ల అసలైన వీడియోలు ఏవో లేదా నకిలీవి ఏంటో తెలుసుకొలేక జనాలుతలలు పట్టుకుంటున్నారు.

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES