• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /YS Jagan: మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..?.. ఏపీ హింసాత్మక ఘటనలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan: మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..?.. ఏపీ హింసాత్మక ఘటనలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan fires on ap govt: రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా ఏపీ సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తుందని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ గుండాలు దాడులు చేస్తున్న పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.

Written ByInamdar Paresh
Published: Oct 18, 2026, 12:30 PM IST|Updated: Oct 18, 2026, 12:44 PM IST
joinshare
YS Jagan: మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..?.. ఏపీ హింసాత్మక ఘటనలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..
Image Credit: ys jagan fires on ap cm chandrababu naidu

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
విజయవాడ మేయర్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన మాజీ ఐపీఎస్ ఏబీ వేంకటేశ్వర రావు..

విజయవాడ మేయర్ అభ్యర్ధిగా నామినేషన్ వేసిన మాజీ ఐపీఎస్ ఏబీ వేంకటేశ్వర రావు..

2

Kakinada: ఏపీలో ఘోరం.. బస్సులో సీటు కోసం గొడవ.. మహిళలపై కర్రలు, రాడ్లతో దాడి.!.

3

తెలంగాణకు చల్లటి కబురు.. ఆ జిల్లాలో వర్షాలు..

4

YS Jagan: మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..?.. ఏపీ హింసాత్మక ఘటనలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

5

Snake video: అరెవావ్.. ఆవు మీద ఎక్కి బుసలు కొడుతున్న రెండు నాగు పాములు.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

YS Jagan fires on ap cm Chandrababu naidu over ap local body polls row: ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. స్థానిక సంస్థల నామినేషన్ వేళ ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పుంగనూరు, కడపతో పాటు పలు చోట్ల కూటమి వర్సెస్ వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య తోపులాట  జరిగింది.పులివెందులలో పోలీసులు గాల్లో  ఏకంగా ఆరురౌండ్ల కాల్పులు జరిపారు. కొన్ని చోట్ల నామినేషన్ కేంద్రాల్లో పరస్పరం దాడులు, నామినేషన్లను చింపివేయడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 

పోలీసులు లాఠీలకు పనిచెప్పి శాంతి భద్రతల సమస్యలు రాకుండా చర్యలు తీసుకున్నారు. టీడీపీ, వైసీపీ పరస్పరం ఎస్ ఈసీలకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు నివురు కప్పిన నిప్పులా ఉన్నాయి. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో స్థానిక సంస్థల నామినేషన్ ల వేళ జరిగిన హింసాత్మక ఘటనలపై మండిపడ్డారు. 

అసలు రాజ్యాంగబద్ధ పాలనలో ఉన్నామా..?.. ఏపీరాష్ట్రంలో చట్టం న్యాయం ఉందా..?.. అంటూ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో కనీసం  అపోసిషన్ పార్టీలకు నామినేషన్లు కూడా వెయ్యనివ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా చంద్రబాబు చెప్పినట్టే వింటుందంటూ మండిపడ్డారు. దీనిపై ప్రతి ఒక్కరు గమనించాలని, ప్రతిదీ వాస్తవమే మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు.

నారాసురుడు రక్త చరిత్ర రాస్తూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతున్నాడంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. వెన్నుపోటు పార్టీ నాయకుడు.. గొడ్డళ్లను సప్లై చేసే నాయకుడు అధర్మ చరిత్ర, రక్త చరిత్ర రాస్తున్నాడంటూ ఏపీ ప్రభుత్వంను ఏకీపారేశారు. అసలు.. ఇది ధర్మమేనా.. న్యాయమేనా అని ప్రజలు ఆలోచన చేయాలంటూ వైఎస్ జగన్ కోరారు. 

ఒకవేళ చంద్రబాబుకు.. ప్రజల మద్దతు నీకుందని భావిస్తే.. ఎందుకు నామినేష‌న్లు వేయ‌నీయ‌డం లేదంటూ జగన్ ప్రశ్నలు సంధించారు. పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని దాడులు చేయిస్తున్నారని,అడ్డ‌గోలు దొంగ కేసులు పెట్టి కిడ్నాప్ చేయిస్తున్నాడంటూ మండిపడ్డారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అనేవాడు చంద్రబాబుకు అభిమానంలో కరుడు గట్టిన ఉగ్రవాది లాంటోడని మండిపడ్డారు. అలాంటి వ్యక్తిని రిటైర్డ్ అయినా మళ్లీ పిలిచి ఈసీ బాధ్యతలు ఇస్తే, ఆయన గారి ఆధ్వర్యంలో ఎన్నికలు అంటే ఇలాగే ఉంటుందంటూ సెటైర్లు వేశారు.

 కేవలం రెండు రోజుల క్రితం రిజర్వేషన్లను ప్రకటించి, కేవలం 24 గంటల వ్యవధిలోనే నామినేషన్లు ప్రక్రియను ప్రారంభించడం ఏంటని మండిపడ్డారు. అపొసిషన్ పార్టీకి కనీసం అభ్యర్థిని ఎంచుకునే సమయం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 

రాష్ట్రంలో ఎస్ఈసీ నిద్రపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఎస్ఈసీగా ఉన్నారని, ఆయన ఎస్పీలను కలెక్టర్లను సైతం బదిలీచేశారని గుర్తు చేశారు. తాము గతంలో 13 మున్సిపల్ కార్పోరేషన్లు క్లీన్ స్వీప్ చేశామని, 85 శాతం డివిజన్లను కైవసం చేసుకున్నామని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Andhra Pradesh
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
Telugu News