Women fight in apsrtc free bus in Kakinada: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు పథకంను అమలు చేస్తున్నాయి. దీనికి మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే కొన్ని సార్లు మహిళలు సీట్ల కోసం కొట్టుకొవడం, పరస్పరం దాడులు చేసుకొవడం వంటివి చేస్తున్నారు. వీరి గొడవలు కాస్త నెట్టింట వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా రద్దీగా ఉన్నవేళల్లో సీట్లకోసం మహిళలతో పాటు, పురుషులు కూడా గొడవలు పడిన ఘటనలు కొకొల్లలు.
తాజాగా.. దసరా వేళ కాకినాడలో బస్సులో కొంతమంది మహిళల మధ్య సీటు విషయంలో గొడవ జరిగింది.ఏపీలోని కాకినాడ జిల్లాలో బస్సులో కొంత మహిళల మధ్యన గొడవ జరిగింది. తుని నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో రచ్చజరిగింది. రాజమండ్రికి చెందిన మహిళలు, సిరిపురంకు చెందిన మహిళతో గొడవపడ్డారు.
దీంతో ఆమె తన భర్తకు ఫోన్ చేసిన తనను కొట్టారని చెప్పింది.ఇక ఆవేశంలో ఊగిపోయిన భర్త సిరిపురం వద్ద బస్సురాగానే.. 30 మంది యువకులతో బస్సుఎక్కి మహిళలపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశాడు. దీంతో రాజమండ్రికి చెందిన మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని ఆపేందుకు చూసిన మరోయువకుడు గాయపడ్డారు. వెంటనే స్థానికులు 112కు కాల్ చేశారు. పోలీసులు ఘటన ప్రదేశంకు చేరుకుని బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. బాధితులను కొట్టి సిరిపురం మహిళ, ఆమె భర్త అక్కడి నుంచి పారిపోయారు.
బాధితులు, బస్సు డ్రైవర్, కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దాడి చేసిన వారు మద్యం మత్తులో, గంజాయి సేవించి ఉన్నారని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఆస్పత్రిలో ఇద్దరు మహిళలకు వైద్యులు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వారికి తలకు తీవ్రగాయాలైనట్లు చెబుతున్నారు.