Viral News: ఉత్తరప్రదేశ్ లోని సీత పూర్ జిల్లాలో ఒక వింతైన కుటుంబ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారుతి వస్తోంది. ఒకే ఇంట్లో తన భర్తతో పాటు ప్రియుడితో కలిసి ఉండేందుకు ఒక వివాహిత ఏకంగా డ్యూటీ చార్ట్ వేసింది.. వేసి పోలీసుల ముందు పెట్టడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అసలు ఆ డ్యూటీ చార్ట్ ఏంటి? అందులో ఏముంది? ఆమె ఆ చార్ట్ వెయ్యడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సీతాపూర్ జిల్లా మహమూదాబాద్ ప్రాంతానికి సంబంధించిన ఇద్దరు పిల్లల తల్లి అయిన ఓ మహిళ.. గత మార్చి 21వ తేదీన ఓ ఆలయంలో వేరొక వ్యక్తితో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కొత్త బంధంలోకి అడుగు పెట్టినప్పటికీ.. తన మొదటి భర్తను వదులుకోవడానికి గానీ.. ప్రియుడికి దూరంగా ఉండటానికి గాని ఆమె సిద్ధంగా లేనట్లు తెలిపింది. ఇద్దరితోను ఒకేసారి కలిసి జీవించాలని ఆమె పట్టుబట్టడంతో కుటుంబంలో ఊహించని గొడవలు మొదలయ్యాయి..
ఈ పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కడంతో.. ఇద్దరు వ్యక్తులతో ఒకే ఇంట్లో ఎలా సర్దుకు పోతావని పోలీసులు ఆ మహిళను ప్రశ్నించారు.. దీనికి ఆమె ఇచ్చిన సమాధానం విని పోలీస్ అధికారులు సైతం ఆశ్చర్యపోయారట.. తాను ఒక ప్రత్యేకమైన డ్యూటీ చార్ట్ ప్రకారం నడుచుకుంటానని ఆమె పోలీసులకు వెల్లడించింది.. పగటిపూట తన ప్రియుడితో పిల్లలతో ఇంట్లో ఉంటానని.. రాత్రి సమయంలో తన భర్త తనతో గడుపుతాడని పోలీసులకు తెలిపింది.. ఇది విన్న పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు..
ఈ వ్యవహారంలో అందర్నీ మరింత ఆశ్చర్యపరిచిన అంశం ఏంటంటే.. ఆమె భర్త కూడా ఒప్పుకున్నాడట. తన భార్య గానీ.. ఆమె ప్రియుడిని గానీ.. వదులుకోవడానికి తనకు ఇష్టం లేదని.. అవసరమైతే తానే ఇల్లు వదిలి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నానని భర్త అన్నట్లు సమాచారం. గతంలో కూడా ఆ ప్రియుడు తన ఇంటికి అనేకసార్లు వచ్చాడని.. ఆ సమయంలో తన భర్త అతడిని ఇతరులకు తన సోదరుడిగా పరిచయం చేసేవాడని ఆ మహిళ తెలిపింది..
అయితే.. ఈ వింత చార్ట్ పై కుటుంబంలోని ఇతర సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండడంతో ఇంట్లో ఉద్రుక్త వాతావరణం నెలకొంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు పోలీసులు భార్య భర్త తో పాటు ప్రియుడితో మాట్లాడి ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారట.. కానీ ఆ మహిళ మాత్రం తన నిర్ణయం పై ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మొండిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డే షిఫ్ట్ ప్రియుడు.. నైట్ షిఫ్ట్ భర్త పేరుతో సోషల్ మీడియాలో వీరు విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తున్నారు.. ఈ ఘటన ఎప్పుడో జరిగినప్పటికీ వీరికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు ఇప్పుడు ఊహించని స్థాయిలోనే వైరల్ అవుతున్నాయి..