Yogi Mother Savitri Devi: యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రి దేవి వృద్ధాప్యం కారణంగా వచ్చిన అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. గతంలోనూ పలుమార్లు ఆరోగ్యం క్షీణించడంతో వైద్య చికిత్స అందించారు. ఉత్తరా ఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లా, యమకేశ్వర్ బ్లాక్‌లోని స్వగ్రామం పంచూర్ లోనే ఉండి వైద్య చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో సీతాదేవి తన పూర్వీకుల స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తల్లి మరణ వార్తను యోగి ఆదిత్య నాథ్ సోదరుడు మహేంద్ర ధృవీకరించారు. మాతృమూర్తి మరణంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ కుటుంబంలో విషాద ఛాయలు నెలకున్నాయి. సావిత్రీదేవి మరణం పట్ల రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సాధారణ మధ్య తరగతి కుటుంబం..
యోగి ఆదిత్యనాథ్ ది సాధారణ మధ్యతరగతి కుటుంబం. యోగి ఆదిత్యనాథ్ స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్‌వాల్ జిల్లా యమకేశ్వర్ బ్లాక్‌లో ఉన్న పంచూర్ గ్రామం. ఉత్తర్ ప్రదేశ్ కు యోగి ఆదిత్య నాథ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ఆయన కుటుంబం మాములు జీవితాన్ని గడుపుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ యుక్తవయసునుంచి కుటుంబానికి దూరమయ్యారు. గోరఖ్ పూర్ మఠంలో సన్యాసాన్ని స్వీకరించి సర్వసంఘపరిత్యాగిగా మారారు.
సొంతూరు పౌరీ గర్వాల్ జిల్లాలోని పంచూర్ గ్రామంలోనే నివాసం..
తల్లి మరణవార్త అందిన సమయంలో యోగి ఆదిత్యనాథ్ తన కర్తవ్య నిబద్ధతను చాటుకున్నారు. గోరఖ్‌పూర్‌లో విద్యార్థులకు ట్యాబ్లెట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే తల్లి సావిత్రీదేవి కన్నుమూశారు. ఈ వార్త సభలోని చాలామందికి తెలిసినా, సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మాత్రం కార్యక్రమం ముగిసే వరకు తెలియదు. అక్కడున్నవారు తమ మొబైల్ ఫోన్లలో వార్తను చూసి ధ్రువీకరించుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే వేదికపై ప్రసంగిస్తున్న సీఎంకు ఈ విషయం తెలియదు. విషాద వార్త తెలిసిన సభికులు భావోద్వేగానికి గురయ్యారు. కొందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. తమ వ్యక్తిగత బాధను పక్కనపెట్టి ప్రజా కార్యక్రమంలో పాల్గొంటున్న సీఎం యోగిని చూస్తూ సభలోని వారు మౌనంగా ఉండిపోయారు. ఆయన ప్రసంగం పూర్తయ్యే వరకు ఈ విషయం ఆయనకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. కార్యక్రమం ముగిసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్‌కు ఆయన తల్లి సావిత్రీదేవి మరణించిన విషయాన్ని తెలియజేశారు. ఈ వార్త విన్న వెంటనే ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కన్నతల్లిని కోల్పోయిన విషాధం యోగిని ఆవరించింది. ఆయనలో ఆవేదన కనిపించింది.
తల్లి మరణంతో యోగి భావోద్వేగం..
యోగి ఆదిత్యనాథ్ కు అమ్మంటే అమితమైన ప్రేమ. 2024 మే 14న అనారోగ్య సమస్యలతో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేరారు. అక్కడి జెరియాట్రిక్ విభాగంలో చికిత్స పొందుతున్న సమయంలో యోగి ఆదిత్యనాథ్ ఆసుపత్రికి వెళ్లి తల్లి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. తల్లిపై ఆయనకు ఉన్న అనుబంధం అప్పట్లో చర్చనీయాంశమైంది. తల్లిని ఆత్మీయంగా పలుకరించి భావోద్వేగానికి గురయ్యారు. అమ్మ త్వరగా కోలుకోవాలని యోగి ఆదిత్యనాథ్ దేవుడిని కోరుకున్నారు.
సావిత్రి దేవికి ఏడుగురు సంతానం..
తల్లి సావిత్రిదేవి గృహిణి ఇల్లు, పిల్లల పెంపకం బాధ్యతలు చూసుకునేది. తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ అటవీ శాఖలో రేంజర్‌గా పని చేసి 1991లో పదవీ విరమణ చేశారు. యోగి తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం. యోగి ఆదిత్యనాథ్ ఐదో సంతానం. కుటుంబమంతా పౌరీ గర్వాల్ జిల్లాలోని పంచూర్ గ్రామంలోనే నివసిస్తోంది. అక్కా చెళ్లెళ్లు ముగ్గురు, అన్నదమ్ములు ముగ్గురు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. అందరూ సాదాసీదాగా రాజకీయాలకు దూరమైన జీవితాన్ని గడుపుతున్నారు.
ఆదిత్యనాథ్ అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిస్త్..
ఆదిత్యనాథ్ అసలుపేరు అజయ్ మోహన్ సింగ్ బిస్త్. కుటుంబం మొత్తం పౌరీ గర్వాల్ జిల్లాలోని పంచూర్ గ్రామంలోనే నివసిస్తోంది. గతంలో 2020 ఏప్రిల్ 20వ తేదీన యోగి తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ 89 ఏళ్ల వయసులో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉండటం, ముఖ్యమంత్రిగా రాష్ట్ర బాధ్యతలు నిర్వహించాల్సి రావడంతో యోగి ఆదిత్యనాథ్ తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలే కపోయారు. ఇప్పుడు తల్లి సావిత్రి దేవి మరణంతో ఆ కుటుంబంలో మరోసారి విషాదఛాయలు అలముకున్నాయి.
యోగి తోబట్టువుల సాదాసీదా జీవితం..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మొత్తం ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. వీరంతా ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో సాధారణ, రాజకీయాలకు దూరమైన జీవితాన్ని గడుపుతున్నారు. యోగి ఆదిత్యనాథ్‌కు పెద్దన్నయ్య మానవేంద్ర మోహన్ బిష్ట్. ఉత్తరాఖండ్‌లోని ఒక కళాశాలలో పనిచేస్తున్నారు. అక్క శశి దేవి, ఉత్తరాఖండ్‌లోని మాతా భువనేశ్వరి దేవి ఆలయం సమీపంలో ఒక చిన్న టీ, అల్పాహారం, పూజా సామాగ్రి దుకాణాన్ని నడుపుతున్నారు. మరో అక్క పుష్పా దేవి. ఈమె గృహిణి. చిన్న అక్క కౌలస్యాదేవి, గృహిణి. ఈమె ప్రచారానికి దూరంగా సాధారణ కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు. తమ్ముడు శైలేంద్ర మోహన్ బిష్ట్. భారత సైన్యంలో సుబేదార్‌గా పనిచేస్తున్నారు. చిన్న తమ్ముడు మహేంద్ర మోహన్ బిష్ట్, ఉత్తరాఖండ్‌లోని ఒక పాఠశాలలో పనిచేస్తున్నారు.
తల్లి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న యోగి..
ఉత్తర్ ప్రదేశ్ కు ముఖ్యమంత్రైనా.. అమ్మకు కొడుకేకదా… తండ్రిని కోల్పోయిన సమయంలో ముఖ్యమంత్రి హోదాలో అంత్యక్రియలకు హాజరుకాని యోగి ఆదిత్యనాథ్, ఇపుడు తల్లి మరణంతో అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం హోదాలో సొంతూరికి చేరుకున్న సందర్భంగా పంచూర్ గ్రామం ప్రభుత్వ ఉన్నతాధికారులు భారీ బందోబస్తు, అధికారుల సందడితో కన్పించింది. అమ్మ భౌతికకాయాన్ని చూసి యోగి ఆదిత్యనాథ్ కన్నీటి పర్యంతమయ్యారు. అంతిమసంస్కారాల్లో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ కనిపెంచిన తల్లి రుణం తీర్చుకున్నారు. కన్నవారికి దూరంగా సన్యాసి జీవితాన్ని గడుపుతున్న యోగి ఆదిత్యనాథ్ ను చూసి తోబుట్టువులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ కుటుంబ సభ్యుల్లో ఆత్మీయత, అనుబంధం చూపరులకు కన్నీళ్లు తెప్పించాయి.
రాష్ట్రపతి, ప్రధాని మోడీ సహా పలువురు సంతాపం..
సావిత్రీదేవి మరణంపట్ల రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం తెలిపారు. తల్లి ప్రేమ, ఆశీర్వాదం, మమకారం మనిషి జీవితంలో అత్యంత విలువైనవని, ఆమె దూరం కావడం కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. కేదార్‌నాథుడిని ప్రార్థిస్తూ సావిత్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని, యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం ప్రసాదించాలని కోరారు.