పదేళ్లుగా పెంచుకున్న చిలుక మిస్సింగ్.. ఆచూకీ చెబితే రూ.11 వేలు గిఫ్ట్!
Missing Parrot Viral News: చిలుక ఉన్నట్టుండి తప్పిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా బాధపడుతున్నారట. అంతేకాకుండా తమ చిలుకను వెతికి పెట్టిన వారికి దాదాపు రూ.11 వేల వరకు నగదు బహుమహి కూడా ప్రకటించారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది.? దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Missing Parrot Viral News: పెంపుడు జంతువులు లేదా పక్షులు మనతో కొన్ని రోజులు ఉంటేనే వాటితో మనకు విడదీయరాని అనుబంధం ఏర్పడడం చాలా సహజం.. అలాంటిది ఏకంగా పదేళ్ల పాటు ఒకే చోట కుటుంబంలో ఒకరై ఉన్న చిలుక అకస్మాత్తుగా కనిపించకుండా పోతే.. ఆ ఇంటివారి బాధ వర్ణనాతీతం.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది.. తమ ముద్దుల చిలుక అలెక్స్‌ను వెతికి తెచ్చిన వారికి రూ.11 వేల గిఫ్ట్ ఇస్తామని ఆ కుటుంబం ప్రకటించడం ఇప్పుడు ఈ ఘనట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..
వారణాసిలోని దారా నగర్‌కి చెందిన అరవింద్ మౌర్య కుటుంబం పదేళ్ల క్రితం ఓ చిలుకను ఎంతో ఇష్టంగా తెచ్చుకుందట... దానికి అలెక్స్ అని పేరు పెట్టి కన్నబిడ్డలా పెంచుకున్నారట.. పదేళ్లుగా ఆ ఇంట్లో అందరితో కలిసిపోయిన అలెక్స్.. తన కిలకిల సందడితో.. అల్లరి చేష్టలతో ఆ ఇంటికి కొత్త కళను తెచ్చిందట.. అయితే, నవంబర్ 16వ తేదీన ఆ కుటుంబం నుంచి చిలుక దూరమైంది.. ఆ రోజు ఇంట్లో టైల్స్ వేసే పనులు జరుగుతున్నాయట.. టైల్స్ కట్ చేసే మిషన్ నుంచి వచ్చిన భారీ శబ్దానికి అలెక్స్ తీవ్ర భయాందోళనకు గురైందట.. ఆ కంగారులో పంజరం నుంచి బయటకు వచ్చి.. ఆకాశంలోకి ఎగిరిపోయింది.
అలెక్స్ కనిపించకపోవడంతో అరవింద్ మౌర్య కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారట.. చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు, ఇరుగుపొరుగు ఇళ్లలో వెతికినా ఏమాత్రం ఫలితం లేకపోయిందట.. దీంతో వారు ఎలాగైనా ఆ చిలుకను కావాలనుకుని నిర్ణయించుకున్నారు. అలెక్స్ మిస్ అని ఫోటోలతో ఉన్న పోస్టర్లను ప్రింట్ చేశారట.. అరవింద్ మౌర్య.. ఆయన కుమారులు వారణాసిలోని గల్లీలలో ఈ పోస్టర్లను అంటిస్తున్నారట. అలెక్స్‌ను సురక్షితంగా తీసుకొచ్చి అప్పగించిన వారికి రూ.11,000 డబ్బులు గిఫ్ట్ ఇస్తామని పోస్టర్లలో తెలిపారు.
ఈ ఘటనలో అందరినీ కదిలిస్తున్న మరో విషయం ఆ ఇంట్లోని పెంపుడు కుక్క పరిస్థితి.. పదేళ్లుగా అలెక్స్, ఆ కుక్క ఎంతో స్నేహంగా మెలిగేవి.. రోజంతా ఇద్దరూ కలిసి ఆడుకునేవట.. ఇప్పుడు అలెక్స్ కనిపించకపోవడంతో ఆ మూగజీవి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుందట. బెంగతో సరిగ్గా ఆహారం తీసుకోకుండా.. ఆటలు మానేసి దిగాలుగా కూర్చుంటోందని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. తమ కుటుంబంలోని ఆనందాన్ని తిరిగి తీసుకురావడానికి ఆ చిలుకను వెతికి పెట్టాలని ఆ కుటుంబ సభ్యులు కన్నీటితో వేడుకుంటోంది..