Vijay Trisha Bond In London: లండన్‌లోని ప్రతిష్టాత్మక సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో శనివారం మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ పోటీలు ఘనంగా జరగనున్నాయి. ఈ పోటీల్లో 44 కార్ల గ్రిడ్ ముందు శనివారం రాత్రి భారత కాలమానం ప్రకారం 9:30 నుండి 11:30 గంటల మధ్య జరిగే #SilverstoneRound రేసును భారతీయ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గ్రీన్ ఫ్లాగ్ ఊపి అధికారికంగా ప్రారంభించనున్నారు. యూకేలో పోటీపడుతున్న భారతీయ రేసర్లకు మద్దతు తెలిపేందుకు ముఖ్యమంత్రి విజయ్ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు రేసు నిర్వాహకులు ధృవీకరించారు.
నటనతో పాటు మోటార్ స్పోర్ట్స్‌పై ఉన్న తీవ్రమైన అభిరుచితో తమిళ హీరో అజిత్ కుమార్ ఈ సిల్వర్‌స్టోన్ రౌండ్ పోటీలలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రిగా తన బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా సమయం కేటాయించి సిల్వర్‌స్టోన్‌కు వచ్చి తమను కలిసినందుకు అజిత్ విజయ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. గత 34 ఏళ్లుగా తాము సినీ పరిశ్రమలో సహచరులుగా ఉన్నామని అజిత్ గుర్తు చేసుకున్నారు.
తమిళనాడుతో పాటు భారతదేశంలో మోటార్ స్పోర్ట్స్‌ను ప్రోత్సహించడానికి, ముఖ్యంగా చెన్నైలో 'లీ మాన్స్' (Le Mans) సిరీస్ వంటి అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలపై విజయ్ చూపిస్తున్న ఆసక్తిని అజిత్ ప్రశంసించారు.
ఇదిలా ఉండగా, లండన్‌లో నటి త్రిషను కలిసిన సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ఆమెతో దిగిన ఒక సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోతో పాటు రేసింగ్ ట్రాక్‌పైకి దిగుతున్న అజిత్ కుమార్‌కు రాధిక ఆల్ ది బెస్ట్ చెప్పారు. అలాగే సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో అజిత్‌ను కలిసిన వీడియోను కూడా పంచుకుంటూ, ఆయన అంకితభావాన్ని స్ఫూర్తిదాయకమని పొగిడారు.
మరోవైపు లండన్ పర్యటన నేపథ్యంలో విజయ్, త్రిషల మధ్య ఉన్న స్నేహం, సంబంధంపై సోషల్ మీడియాలో మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. 2004లో వచ్చిన 'గిల్లి' అనే తమిళ సినిమాతో పాటు 'తిరుపాచి', 'ఆది', 'కురువి', 'లియో' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. కొన్నేళ్లుగా వీరి స్నేహంపై రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ ఇద్దరూ వీటిని అధికారికంగా ధృవీకరించలేదు.
గతంలో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేసుకుని ఉపసంహరించుకోవడం, చెన్నై వెడ్డింగ్ రిసెప్షన్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడం, తమిళనాడు ఎన్నికల ఫలితాల రోజు విజయ్ నివాసంలో త్రిష ఉండటం, ప్రమాణ స్వీకారం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విజయ్ తల్లిదండ్రుల పక్కన త్రిష కూర్చోవడం వంటి సంఘటనలు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చాయి.
Also Read: బ్రిక్స్ సదస్సు..ఢిల్లీ డిక్లరేషన్‌కు సభ్య దేశాల ఏకగ్రీవ ఆమోదం..ఏమున్నాయంటే?
Also Read: అన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవు..ఎట్టకేలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook