Vivo 12000mah Battery Smartphone: గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఎంలో శక్తివంతమైన బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలోనే రచ్చ చేయబోతోంది. కస్టమర్స్‌కి రోజుల తరబడి ఛార్జింగ్ సమస్య లేకుండా చేసేందుకు ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ వీవో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. తాజాగా లీక్ అయిన వివరాల ప్రకారం.. ఏకంగా 12,000mAh బ్యాటరీతో అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే, ఇప్పటికీ ఈ కంపెనీ కేవలం 5,000mAh నుంచి 6,000mAh బ్యాటరీలు కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చైనాకు చెందిన ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్ వీబోలోని డిజిటల్ చాట్ స్టేషన్ అద్భుతమైన వివరాలను లీక్ చేశారు.. నేరుగా కంపెనీ పేరును చెప్పకుండా బ్లూ మాన్యుఫ్యాక్చరర్ అని పెట్టి కొన్ని రకాల వివరాలను వెల్లడించారు.. కానీ టెక్ నిపుణులు మాత్రం.. ఇది వివో గురించేనని స్పష్టం చేశారు. ఈ లీక్‌ల వివరాల ప్రకారం.. సంస్థ సిద్ధం చేసిన ఈ బ్యాటరీ రేటెడ్ కెపాసిటీ 11,970mAhగా ఉన్నట్లు తెలుస్తోంది.. దీనిని మార్కెట్‌లో 12,000mAh సమార్థ్యానికి సంబంధించిన బ్యాటరీగా పరిగణిస్తారట.. గత ఫిబ్రవరిలోనే 11,000mAh నుంచి 12,000mAh వరకు కెపాసిటీ కలిగిన బ్యాటరీలను పరీక్షించినట్లు తెలుస్తోంది..
ఈ భారీ బ్యాటరీ మాత్రమే కాకుండా.. ఇది పెద్ద స్క్రీన్‌లతో అందుబాటులోకి వచ్చేలా వీవో కంపెనీ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 12,000mAh బ్యాటరీని కంపెనీ ఏయే మోడల్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలిదు.. అయితే, భవిష్యత్ హై-ఎండ్ లేదా గేమింగ్ మొబైల్స్‌లో ఇది కీలక ఫీచర్‌గా మారే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది..
Vivo వచ్చే ఏడాది ఒక సరికొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద సైజు ఫోల్డబుల్ లేదా వెడల్పాటి స్క్రీన్ డిజైన్‌పై పరీక్షలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వివో సబ్ బ్రాండ్ iQOO సైతం 7-అంగుళాల భారీ డిస్‌ప్లేతో పాటు 10,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీతో కూడిన ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 2027 సంవత్సరంలోని రెండవ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్ల తెలుస్తోంది.