Motorola Razr Flex 27 Foldable Phone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్‌కి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటరోలా సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా టెక్ వర్గాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్న మోటరోలా రేజర్ ఫ్లెక్స్ 27 (Motorola Razr Flex 27) స్మార్ట్‌ఫోన్ సంబంధించిన లీక్‌లను కంపెనీ అధికారికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. సంస్థకు చెందిన ఆస్ట్రేలియా సపోర్ట్ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ పేరు కనిపించడంతో త్వరలోనే ఇది అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి.. వీటికి సంబంధించిన అన్ని వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మార్కెట్లో సాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8తో పాటు యాపిల్ నుంచి వచ్చిన ఐఫోన్ డ్యూయో వంటి ప్రీమియం ఫోల్డబుల్ మోడల్స్‌కు నేరుగా పోటీగా మోటరోలా ఈ ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. టుడోసెల్యులార్ సంస్థ షేర్ చేసిన ఒక తాజా వీడియోలో ఈ ఫోన్ డిజైన్‌తో పాటు అనేక వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది కేవలం 5.8 మిమీ మందంతో పాటు కేవలం 215 గ్రాముల బరువుతో ఈ ఫోన్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..
లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో 4.97-అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. లోపలి భాగంలో 6.92-అంగుళాల భారీ మెయిన్ డిస్ల్పేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. రెండు డిస్‌ప్లేలు కూడా అత్యంత 165Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గీక్‌బెంచ్ (Geekbench) లిస్టింగ్ ప్రకారం.. ఇందులో 12GB ర్యామ్‌తో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మల్టీ టాస్కింగ్ కోసం ఇందులో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను వినియోగించినట్లు లీక్ అయిన వివరాల చెబుతున్నాయి. అంతేకాకుండా ఇందులో 5,000mAh గల భారీ బ్యాటరీని కూడా కలిగి ఉండడం విశేషం..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎంతో శక్తివంతమైన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు మరో 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వీడియో కాల్స్‌తో పాటు సెల్ఫీల కోసం డ్యూయల్ సెల్ఫీ సెటప్‌తో 32-మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందిస్తోందట.. అలాగే అద్భుతమైన IP రేటింగ్‌తో వాటర్-డస్ట్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉండబోతోంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..