Moral Story: ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో 'విశాల్' అనే యువకుడు చిన్న వయసులోనే 'వైస్ ప్రెసిడెంట్'అనే అత్యున్నత పదవిని అధిష్టించాడు. విదేశాల్లో చదువుకోవడం, పెద్ద పేరున్న యూనివర్సిటీ డిగ్రీలు ఉండటంతో.. కంపెనీ యజమాని అతనికి ఆ పెద్ద పోస్ట్ ఇచ్చాడు. విశాల్‌కు తన డిసిగ్నేషన్ చూసుకుని చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడు. ఆ గర్వంతోనే తన తోటి ఉద్యోగులను చిన్నచూపు చూడటం అతని అలవాటు. తన పేరు పక్కన ఉన్న ఆ పెద్ద హోదానే తన గొప్పతనమని అతను భ్రమపడేవాడు.
అదే ఆఫీస్‌లో 'రాఘవయ్య' అనే వయసు మళ్ళిన సీనియర్ మేనేజర్ పనిచేస్తుండేవాడు. ఆయనకు ఎలాంటి పెద్ద డిగ్రీలు లేవు. హోదా కూడా చిన్నదే. కానీ దశాబ్దాల అనుభవం, సమస్యను క్షణంలో పరిష్కరించే అపారమైన మేధస్సు ఆయన సొంతం. ఆఫీస్‌లో ఏ పెద్ద సమస్య వచ్చినా అందరూ రాఘవయ్య దగ్గరికే వెళ్లేవారు.
ఒకసారి కంపెనీకి కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ ఆర్డర్ రాబోయే కీలక తరుణంలో.. అనుకోకుండా ఒక పెద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. క్లయింట్లు కంపెనీకి వచ్చి అరగంటలో డెసిషన్ చెప్పమన్నారు. విశాల్ తన హోదాను అడ్డం పెట్టుకుని ఎంతో మంది టెక్నికల్ నిపుణులకు ఫోన్లు చేశాడు. కానీ ఎవరికీ ఆ సమస్యకు పరిష్చారం దొరకలేదు. విశాల్‌కు ఏం చేయాలో తోచక చెమటలు పట్టాయి. భయంతో వణికిపోతున్న అతనికి ఏ డిసిగ్నేషన్ కూడా సాయం చేయలేకపోయింది.
అది గమనించిన రాఘవయ్య నెమ్మదిగా అక్కడికి వచ్చి, సమస్యను పరిశీలించి.. కేవలం ఐదు నిమిషాల్లో ఒక సింపుల్ టెక్నిక్‌తో ఆ సమస్యను చిటికెలో పరిష్కరించాడు. క్లయింట్లు సంతోషపడి వెంటనే ఆ ప్రాజెక్ట్‌ను ఆ కంపెనీకి అప్పగించారు.
అది చూసిన విశాల్ సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ క్షణంలో యజమాని విశాల్‌తో అంటాడు: "విశాల్! నీ పేరు పక్కన పెద్ద డిసిగ్నేషన్ ఉండొచ్చు, కానీ సంక్షోభం వచ్చినప్పుడు కాపాడేది ఆ హోదా కాదు.. నీ బుర్రలో ఉన్న తెలివితేటలు, అనుభవం!" ఆ రోజుతో విశాల్‌లోని గర్వం పూర్తిగా కరిగిపోయింది.
ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే.. పేరు పక్కన ఎంత పెద్ద డిసిగ్నేషన్ ఉన్నా ఉపయోగం లేదు.. క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయం తీసుకునే బుర్రలో తెలివి, అనుభవమే మనిషికి అసలైన గుర్తింపును తెచ్చిపెడతాయి."
Also Read: