• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Vivo కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదరగొట్టే ఫీచర్లు!

Vivo కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదరగొట్టే ఫీచర్లు!

Vivo V80 Fe: భారత మార్కెట్‌లోకి వివో V80 FE స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అద్భుతమైన రెడ్‌ కలర్‌లో విడుదల కాబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 21, 2026, 12:55 IST|Updated: Nov 21, 2026, 13:03 IST
joinshare
Vivo కొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదరగొట్టే ఫీచర్లు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vivo V80 Fe: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా  వివో V80 FE మోడల్ త్వరలోనే మార్కెట్లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోనూ ప్రత్యేక్షమైనట్లు తెలుస్తోంది.. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డేటాబేస్‌లో  V2624 మోడల్ నంబర్‌తో వివో V80 FE ప్రత్యేక్షమైంది. దీనిని బట్టి ఈ ఫోన్ భారత్‌లో అందుబాటులోకి రావడం ఖాయమైనట్లు చర్చ జరగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్ స్పార్క్లింగ్ గోల్డ్, చిల్ గ్రీన్ కలర్‌ ఆప్షన్స్‌లో.. భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసేందుకు ఎరుపు , ఆకుపచ్చ కలర్‌ ఆప్షన్స్‌లో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెడ్‌ కలర్‌ వేరియంట్ కేవలం భారతీయ వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా తయారు చేసినట్లు టెక్ వర్గాలు కూడా తెలిపాయి. అయితే, భారత లాంచ్ తేదీపై వివో ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

వివో V80 FE స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని వివరాల్లోకి వెళితే.. ఇది 6.59-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని సమాచారం. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారిత  ఒరిజిన్ OS 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా 50-మెగాపిక్సెల్ ZEISS-బ్రాండెడ్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో కూడా రాబోతోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో 50-మెగాపిక్సెల్ కెమెరాను అందించడం చాలా విశేషం.. ఇక ఈ ఫోన్‌లో కంపెనీ ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీని కూడా అందిస్తోంది.. దీనిని ఛార్జ్ చేసేందుకు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Tech News