7000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. వివో కొత్త ఫోన్ ఫీచర్లు లీక్!
Vivo V80 FE: వివో V80 FE స్మార్ట్‌ఫోన్ మోడల్ అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ 7400-టర్బో ప్రాసెసర్, 7000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo V80 FE: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Vivo త్వరలో కొత్త మోడల్ వివో V80 FE విడుదల చేయబోతోంది.. మార్కెట్లోకి అధికారికంగా విడుదల కావడానికి ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లీక్‌లు అందుబాటులోకి వచ్చాయి.. తాజాగా ఈ ఫోన్ ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్ సర్టిఫికేషన్‌తో కూడా అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ మోడల్‌కి సంబంధించిన కొన్ని వివరాలను టిప్‌స్టర్ అన్విన్ పంచుకున్నారు. ఈ లిస్టింగ్‌లో ఫోన్ మోడల్ నంబర్ V2624తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గీక్‌బెంచ్ సమాచారం ప్రకారం.. వివో V80 FE స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ MT6878 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7400-టర్బో ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.. ఈ ఫోన్‌లో మల్టీ టాస్కింగ్ కోసం 8GB ర్యామ్‌ను కూడా అందిస్తోంది.. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఇది ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. బెంచ్‌మార్క్ పరీక్షలలో ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్టులో 911 పాయింట్లతో పాటు మల్టీ-కోర్ టెస్టులో 3118 పాయింట్లు పొందినట్లు తెలుస్తోంది..
వివో V80 సిరీస్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.59-అంగుళాల అమోలెడ్ (AMOLED) డిస్ల్పేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. కెమెరా పరంగా వివో తమ ZEISS బ్రాండింగ్ టెక్నాలజీతో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు అదనంగా 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఫ్రంట్ భాగంలో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ స్పార్క్లింగ్ గోల్డ్‌తో పాటు చిల్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ అద్భుతమైన కెమెరా మాడ్యుల్‌ను కూడా కలిగి ఉంటుందని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇందులో దీర్ఘకాలం పనిచేసేలా భారీ 7000mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు లీక్ అయిన వివరాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా ఈ భారీ బ్యాటరీని రీఛార్జ్ చేసేందుకు 90W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించడం విశేషం.. అయితే, అతి త్వరలోనే ఈ మోడల్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.