Delhi Train Theft Video: రైళ్లలో కిటికీ దగ్గరే కూర్చునే వారిని లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసే ముఠాలు నిత్యం రెచ్చిపోతూ ఉంటాయి. అయితే, దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో దొంగతనానికి ప్రయత్నించిన ఓ వ్యక్తికి ప్రయాణికులు ఊహించని షాక్ ఇచ్చేశారు. కదులుతున్న రైలు కిటికీలోంచి.. ప్రయాణికుల చేతిలోని ఉన ఫోన్‌ని లాక్కోవడానికి చేతులు చాచిన.. ఓ దొంగను ప్రయాణికులు సింపుల్‌గా పట్టుకున్నారు. వదిలిపెట్టకుండా.. అలాగే రైలు కిటికీకి వేలాడదీసిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్ పరిధిలో కదులుతున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుందట.. రైలు కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికుల నుంచి ఖరీదైన ఫోన్లు దొంగిలించేందుకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రయత్నించాడట.. బయట నుంచి కిటికీ గ్రిల్స్ మధ్య నుంచి చేతిని లోపలికి దూర్చాడు.. అయితే.. లోపల ఉన్న ప్రయాణికుడు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించి దొంగ చేతిని గట్టిగా పట్టుకుండిపోయాడు.
ఆ రైళు భోగిలో ఉండే ప్రయాణికులు కూడా వెంటనే అప్రమత్తమై.. ఆ దొంగ చేతిని వదలకుండా పట్టుకున్నారు. దీంతో రైలు వేగంగా వెళ్తున్నప్పటికీ.. ఆ దొంగ రైలు బయట గాలిలోనే వేలాడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది.. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా.. ప్రయాణికులు పట్టు విడవకపోవడంతో.. తదుపరి స్టేషన్ వచ్చేంత వరకు అతడు అలాగే భయంతో బిక్కుబిక్కుమంటూ రైలుతో పాటు వేలాడుతూ ఉండిపోయాడు..
ఈ మొత్తం ఘటనను బోగీలోని కొందరు ప్రయాణికులు.. తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు.. దాదాపు 94 సెకన్ల కలిగిన ఈ వీడియో ప్రస్తుతం ఎక్స్‌తో పాటు ఇతర సోషల్ మీడియాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. వీడియోలో ప్రయాణికులు కిటికీ దగ్గరే ఉండి.. దొంగను గట్టిగా పట్టుకుని ఉండటం.. బయట అతను రైలును పట్టుకుని.. వేలాడుతూ వేడుకోవడం స్పష్టంగా మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. ఢిల్లీలో దొంగను ఇలా పట్టుకున్నాం.. అని ప్రయాణికులు మాట్లాడుకోవడం కూడా వీడియోలో మీరు క్లియర్‌గా చూడొచ్చు.. ఈ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు మిశ్రమంగా స్పందిస్తూ వస్తున్నారు.
— Sharma ji (@Sharmaji2772) November 7, 2026