Youtuber Fireworks Experiment Video: దీపావళి సందర్భంగా సోషల్ మీడియాలో సరికొత్త ప్రయోగాలు, వింత విన్యాసాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. ఇందులో భాగంగా భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్ మిస్టర్ ఇండియన్ హ్యాకర్ చేసిన ఒక ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. ఏకంగా 1,000 రాకెట్లను ఒకేసారి నిప్పంటించారు.. ఆకాశంలో దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. పగటి సమయంలో ఎర్రటి రాకెట్ బాక్సులను పేర్చి.. వందలాది రాకెట్లను ఒకచోట కట్టి పెద్ద గుత్తులుగా సిద్ధం చేయడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. సాయంత్రం కాగానే.. ఈ రాకెట్లన్నింటికీ.. ఒకేసారి నిప్పంటించారు. క్షణాల వ్యవధిలోనే కింది నుంచి భారీ ఎత్తున నారింజ రంగు మంటలు రావడం మీరు గమనించవచ్చు.. ఆ వెంటనే ఆకాశంలో ఆకుపచ్చ.. తెలుపు రంగుల స్పార్క్‌లతో కూడిన భారీ పేలుళ్లు సంభవించి.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోవడం మీరు చూడొచ్చు..
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లలో స్పందిస్తున్నారు.. కొందరు యూజర్లు అద్భుతమైన దృశ్యం.. కళ్లు చెదిరే క్రాకర్స్ అంటూ ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇంత మొత్తంలో కాలుష్యాన్ని సృష్టించడం.. భారీగా డబ్బు వృథా చేయడం ఎందుకని.. మండిపడుతున్నారు. ఆ డబ్బుతో పేద పిల్లలకు టపాసులు లేదా ఇతర అవసరమైన వస్తువులను పంచితే బాగుండేదని సూచిస్తున్నారు..
ఇది విశాలమైన ఖాళీ మైదానంలో జరిగినట్లు తెలుస్తోంది. లేదంటే ప్రమాదం జరిగి ఉండేదని నిపుణులు తెలుపుతున్నారు.. ఎవరూ కూడా ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు ఇళ్ల వద్ద బాల్కనీలలో లేదా వీధుల్లో చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ విన్యాసం చేసిన మిస్టర్ ఇండియన్ హ్యాకర్ అసలు పేరు దిల్‌రాజ్ సింగ్ రావత్.. అతని ఛానల్‌కు 50 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు తెలుస్తోంది.