• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Vivo V80 ఫోన్‌ అక్టోబర్ 6న లాంచ్.. 7,200mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదరగొట్టనున్న మొబైల్!

Vivo V80 ఫోన్‌ అక్టోబర్ 6న లాంచ్.. 7,200mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదరగొట్టనున్న మొబైల్!

Vivo V80 India Launch News: మార్కెట్‌లోకి Vivo V80 స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్‌ కాబోతోంది. దీనిని అక్టోబర్ 6న అధికారికంగా విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Reported ByDharmaraju DhurishettyEdited ByDharmaraju Dhurishetty
Published: Sep 30, 2026, 01:23 PM IST|Updated: Sep 30, 2026, 01:25 PM IST
joinshare
Vivo V80 ఫోన్‌ అక్టోబర్ 6న లాంచ్.. 7,200mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదరగొట్టనున్న మొబైల్!
Image Credit: జీ తెలుగు న్యూస్..

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vivo V80 India Launch: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో వివో బ్రాండ్‌కి మంచి క్రేజ్‌ ఉంది. త్వరలోనే తన లేటెస్ట్ ప్రీమియం డివైజ్‌  Vivo V80ను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ గతంలో మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన  వివో V70కి సక్సెసర్‌గా ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అధికారంగా కంపెనీ విడుదల చేయకముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన డిజైన్‌తో పాటు కెమెరా, బ్యాటరీ స్పెషిఫికేషన్స్‌, వేరియంట్స్‌ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఇప్పటికే దీనికి సంబంధించిన మైక్రోసైట్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

భారత్‌లో లాంచ్ ఎప్పుడు? 
అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చిన మైక్రోసైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. Vivo V80 స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 6న అధికారికంగా భారత మార్కెట్‌లోకి అధికారికంగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ మొత్తం మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వెల్లడించిన లీక్స్ ప్రకారం.. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 8 GB ర్యామ్‌తో పాటు 128 GB స్టోరేజ్‌తో రూ.63,000తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇది 8 GB ర్యామ్‌తో పాటు 256 GB స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.70,000తో లభిస్తోంది. ఇక చివరి వేరియంట్ 8 GB ర్యామ్‌తో పాటు 512 GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.80,000తో అందుబాటులోకి రానుంది. గత మోడల్ V70తో పోల్చితే.. దీని ధర కాస్త పెరిగినట్లు తెలుస్తోంది.. అయితే, ఇందులో ఇచ్చే అడ్వాన్స్‌‌డ్ హార్డ్‌వేర్, ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ స్పెసిఫికేషన్ల కారణంగానే ధర పెరిగినట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

అదిరిపోయే డిస్‌ప్లే..
ఈ స్మార్ట్‌ఫోన్‌ 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించే.. 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది గేమింగ్‌తో పాటు మూవీస్‌ చేసేవారికి ఎంతో బాగుంటుంది. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత OriginOS పై రన్ అవుతుందని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. ఇది చాలా ప్రత్యేకమైన Zeiss బ్రాండింగ్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది.

ఇందులో కంపెనీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌‌తో 50MP Sony LYTIA 700V సెన్సార్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఇక ఇందులో 50MP నైట్ టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా లభిస్తోంది.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో ఎంతో శక్తివంతమైన 50MP కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. Vivo V80 స్మార్ట్‌ఫోన్‌లో మోస్ట్ పవర్‌ఫుల్‌ 7,200mAh భారీ బ్యాటరీని కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనికి తోడు 90W FlashCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.. సింగిల్ ఛార్డ్‌పై దాదాపు 39 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News