Vivo X Fold 6 Latest News: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ ఫోల్డబుల్ మొబైల్ సిరీస్‌లో అందుబాటులోకి తీసుకు రానుంది. పాపులర్ ఫోల్డబుల్ సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి రాబోతున్న వివో ఎక్స్ ఫోల్డ్ 6 (Vivo X Fold 6) అతి త్వరలోనే ఇంటర్ నేషనల్ మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు అధిరికా సమాచారం.. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. యూరప్‌కు చెందిన ప్రముఖ రిటైలర్ వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలు లిస్ట్ కూడా అయ్యాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై టెక్ మార్కెట్‌లో భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా యూరోపియన్ రిటైలర్ డేటాబేస్‌లో లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోల్డబుల్ ఫోన్ గ్లోబల్ వేరియంట్‌గా కంపెనీ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ లిస్టింగ్‌లో భాగంగా డిజైన్‌తో పాటు వేరియంట్ల, కొన్ని రకాల ఫీచర్స్ కూడా అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ అత్యంత త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. మల్టీటాస్కింగ్‌తో పాటు హెవీ గేమింగ్, ఫోల్డబుల్ స్క్రీన్‌పై ఒకేసారి అనేక అప్లికేషన్లను సాఫీగా రన్ చేయడానికి ఎంతో అనుగుణంగా 16GB వరకు హై-స్పీడ్ ర్యామ్‌తో పాటు భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. అత్యాధునిక ఆండ్రాయిడ్ వెర్షన్ ఫన్‌టచ్ ఓఎస్ (Funtouch OS)పై రన్ అవుతున్నట్లు సమాచారం.
కెమెరా ప్రత్యేకతలు..
ఈ వీవో ఫోల్డబుల్ ఫోన్ చాలా స్లిమ్‌గా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అత్యంత తక్కువ బరువుతో లాంచ్ కాబోతోంది. Vivo X Fold 6 మోడల్‌లో డ్రాప్‌లెట్ హింజ్ మెకానిజమ్‌ను తీసుకు రాబోతున్నట్లు సమాచారం.. ఇది హై-రీఫ్రెష్ రేట్ AMOLED ఫోల్డబుల్ మెయిన్ డిస్‌ప్లేతో పాటు లోపల పెద్ద కవర్ స్క్రీన్‌ను అందించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఫోటోగ్రఫీ కోసం కెమెరా లెన్స్ తయారీ సంస్థ Zeiss బ్రాండింగ్‌తో కూడిన పెరిస్కోప్ టెలిఫోటో, అల్ట్రా-వైడ్ లెన్స్‌లతో కూడిన హై-ఎండ్ మల్టీ-కెమెరా సెటప్‌ను ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ Vivo X Fold 6 స్మార్ట్‌ఫోన్ యూరోపియన్ మార్కెట్‌తో పాటు భారత్‌లో కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం..