SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vivo X Fold 6 లాంచ్‌కు రంగం సిద్ధం.. కెమెరా, డిస్‌ప్లే, డిజైన్ ప్రత్యేకతలివే!

Vivo X Fold 6: త్వరలోనే మార్కెట్‌లోకి వివో ఎక్స్ ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ కూడా విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ దిమ్మతిరిగే ఫీచర్స్‌ లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 30, 2026, 03:26 PM IST | Updated: Sep 30, 2026, 03:28 PM IST
Image Credit: జీ తెలుగు న్యూస్..
Join

Vivo X Fold 6 Latest News: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వివో మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ ఫోల్డబుల్ మొబైల్ సిరీస్‌లో అందుబాటులోకి తీసుకు రానుంది. పాపులర్ ఫోల్డబుల్ సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి రాబోతున్న వివో ఎక్స్ ఫోల్డ్ 6 (Vivo X Fold 6) అతి త్వరలోనే ఇంటర్‌ నేషనల్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు అధిరికా సమాచారం.. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. యూరప్‌కు చెందిన ప్రముఖ రిటైలర్ వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలు లిస్ట్ కూడా అయ్యాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై టెక్‌ మార్కెట్‌లో భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తాజాగా యూరోపియన్‌ రిటైలర్‌ డేటాబేస్‌లో లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ గ్లోబల్‌ వేరియంట్‌గా కంపెనీ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ లిస్టింగ్‌లో భాగంగా డిజైన్‌తో పాటు వేరియంట్ల, కొన్ని రకాల ఫీచర్స్‌ కూడా అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ అత్యంత త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. మల్టీటాస్కింగ్‌తో పాటు హెవీ గేమింగ్, ఫోల్డబుల్ స్క్రీన్‌పై ఒకేసారి అనేక అప్లికేషన్లను సాఫీగా రన్ చేయడానికి ఎంతో అనుగుణంగా 16GB వరకు హై-స్పీడ్ ర్యామ్‌తో పాటు భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. అత్యాధునిక ఆండ్రాయిడ్ వెర్షన్‌ ఫన్‌టచ్ ఓఎస్ (Funtouch OS)పై రన్‌ అవుతున్నట్లు సమాచారం.

కెమెరా ప్రత్యేకతలు..
ఈ వీవో ఫోల్డబుల్‌ ఫోన్ చాలా స్లిమ్‌గా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అత్యంత తక్కువ బరువుతో లాంచ్‌ కాబోతోంది.  Vivo X Fold 6 మోడల్‌లో డ్రాప్‌లెట్ హింజ్ మెకానిజమ్‌ను తీసుకు రాబోతున్నట్లు సమాచారం.. ఇది హై-రీఫ్రెష్ రేట్ AMOLED ఫోల్డబుల్ మెయిన్ డిస్‌ప్లేతో పాటు లోపల పెద్ద కవర్ స్క్రీన్‌ను అందించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఫోటోగ్రఫీ కోసం కెమెరా లెన్స్ తయారీ సంస్థ Zeiss బ్రాండింగ్‌తో కూడిన పెరిస్కోప్ టెలిఫోటో, అల్ట్రా-వైడ్ లెన్స్‌లతో కూడిన హై-ఎండ్ మల్టీ-కెమెరా సెటప్‌ను ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ Vivo X Fold 6 స్మార్ట్‌ఫోన్‌ యూరోపియన్ మార్కెట్‌తో పాటు భారత్‌లో కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES