Vivo Y600K Turbo Price: మార్కెట్‌లో వివో మొబైల్స్‌కు అద్భుతమైన డిమాండ్ ఉండడంతో ఇవి విపరీతంగా అమ్ముడవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని వీవో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది.. ముఖ్యంగా అత్యంత చీప్ ధరల్లోనే ప్రీమియం మొబైల్స్‌ను లాంచ్ చేస్తోంది. అయితే, అత్యంత త్వరలోనే వివో వై600కె టర్బోను విడుదల చేయబోతోంది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిని ఈ ఏడాది చైనాలో అందుబాటులోకి తీసుకు వచ్చిన వివో వై600 టర్బో రీబ్రాండెడ్ వెర్షన్ అని మార్కెట్‌లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Vivo Y600K Turbo స్మార్ట్‌ఫోన్ V2553A అనే మోడల్ నంబర్‌తో పాటు PD2553 అనే డివైస్ కోడ్‌తో Google Play Consoleలోని సపోర్ట్ చేసే డివైస్‌ల లిస్ట్‌లో ఇప్పటికే చేర్చారు.. ఈ మోడల్ నంబర్‌తో పాటు డివైస్ కోడ్ Vivo Y600 Turboకి కూడా సంబంధించినవేని తెలుస్తోంది.. దీనిని బట్టి.. త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కాబోయే, ఈ స్మార్ట్‌ఫోన్ Vivo Y600 Turbo రీబ్రాండెడ్ వెర్షన్ అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, Vivo ఈ మొబైల్‌కి సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు.. Google Play Consoleలోని ఈ లిస్టింగ్ అయిన వివరాల ప్రకారం.. రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని డిస్‌ప్లే రిజల్యూషన్ 1,260 x 2,800 పిక్సెల్స్‌తో పాటు పిక్సెల్ డెన్సిటీ 480 dpiగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది..
ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ QTI SM7635 చిప్ ప్రాసెసర్‌పై అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. 2.80 GHz క్లాక్ స్పీడ్‌తో కూడిన ప్రైమ్ CPUపై పని చేస్తున్నట్లు సమాచారం.. దీనిని బట్టి వివో Y600K టర్బో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 లేదా స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్ ప్రాసెసర్‌పై పని చేసే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది.. వివో Y600 ప్రో 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ కూడిన అద్భుతమైన 6.83-అంగుళాల OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది..
వివో Y600 టర్బో మొబైల్ అద్భుతమైన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని బ్యాక్ సెటప్‌లో చాలా ప్రీమియం 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. సెల్ఫీతో పాటు వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కంపెనీ అందిస్తున్నట్లు లీక్ అయిన వివరాలు తెలుపుతున్నాయి. ఇందులో కంపెన మోస్ట్ పవర్‌ఫుల్ 9,020 mAh బ్లూ ఓషన్ బ్యాటరీని అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 90 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.. ఇవే కాకుండా చాలా రకాల అద్బుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి