దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలి? శివుడితో సంబంధం ఏంటి?
Palapitta On Vijayadashami: తెలంగాణ ప్రాంతంలో దసరా రోజున పాలపిట్టను చూడడం ఒక ఆచారంగా భావిస్తూ ఉంటారు. అసలు ఈ రోజే పాలపిట్టని ఎందుకు చూస్తారు ఎవరికైనా తెలుసా? దీని వెనక ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. అంతేకాకుండా ఆశ్చర్యం కలిగించే విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో? విజయదశమి రోజు పాలపిట్టని ఎందుకు చూడాలో? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Palapitta On Vijayadashami News: దసరా అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది రావణ దహనంతో పాటు జమ్మి పూజ.. తెలంగాణ ప్రాంతంలో అలయ్-బలయ్.. అయితే, వీటితో పాటు తెలుగు సాంప్రదాయంలో తరతరాలుగా కొనసాగుతున్న మరో ముఖ్యమైనది పాలపిట్ట దర్శనం.. విజయదశమి రోజున సాయంత్రం పాలపిట్టను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని. చేపట్టిన పనుల్లో తిరుగులేని విజయం లభిస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈరోజు నిజంగా పాలపిట్ట దర్శనం వల్ల విజయాలు కలుగుతాయా? అసలు ఈ సాంప్రదాయమేంటి? దీని వెనక ఉన్న పురాణ గాథలేంటి.. ఈ ఆచారాలకు అర్థమేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పురాణాల ప్రకారం.. పాలపిట్టను సాక్షాత్తుగా పరమశివుడి స్వరూపంగా భావిస్తూ ఉంటారట.. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని మింగిన సమయంలో గొంతులో బంధించిన శంకరుడిని నీలకంఠుడు అంటూ ఉంటారట.. పాలపిట్ట మెడ కూడా నీలిరంగులో ఉండడంవల్ల దీనిని నీలకంఠ పక్షిగా.. శివుని స్వరూపంగా తెలుగు ప్రజలు కొలుస్తూ ఉంటారు. అందుకే దసరా రోజు పాలపిట్ట దర్శనం చాలా ముఖ్యమైంది గా భావిస్తూ ఉంటారట..
లంకాధిపతి రావణాసురుడు పై యుద్ధానికి బయలుదేరే ముందు శ్రీరాముడికి పాలపిట్ట దర్శనం దర్శనమిచ్చిందని ఎన్నో పురాణ కథలు ఉన్నాయి.. ఆ శుభశకునం ఫలితంగానే శ్రీరాముడు రావణుడిని సంహరించి విజయం సాధించాడని చెబుతూ ఉంటారు. అలాగే పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని.. జమ్మి చెట్టుపై దాచిన తమ ఆయుధాలను తిరిగి తీసుకునే సమయంలో పాలపిట్ట కనిపించిందట.. ఆ తర్వాత జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామం లో పాండవులు విజయం సాధించడంతోపాటు విజయానికి సంకేతంగా దీనిని దర్శించుకోవడం ఒక ఆచారమైందట..
ఆధ్యాత్మిక నమ్మకాలతో పాటు ఈ ఆచారం వెనక ఒక అద్భుతమైన పర్యావరణ స్పృహ కూడా ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు.. పాలపిట్ట వంట చేనులను నాశనం చేసే పురుగులతో పాటు విడతలను, కీటకాలను ఆహారంగా తీసుకుంటుందట.. ఇటువంటి రసాయనాలు లేకుండా పంటలను కాపాడే రైతు నేస్తం అని చెబుతూ వస్తున్నారు. అందుకే పంటలు తీసుకొచ్చే సమయంలో రైతును ఈ పక్షిని గౌరవంగా చూసే సాంప్రదాయం కూడా ఉందని సమాచారం..
ఒకప్పుడు పల్లెల్లో అప్పుడప్పుడు కనిపించిన పాలపిట్టలు ప్రస్తుతం ఆధునిక వ్యవసాయ పద్ధతుల కారణంగా.. విపరీతమైన పురుగుల మందుల వాడకాలు, చెట్లు తగ్గిపోవడం వల్ల అసలు కనిపించకుండా పోతూ వస్తున్నాయి.. దసరా రోజు శుభం కోసమంటూ పక్షులను బంధించి దర్శించుకునే వారిపై వన్యప్రాణి సంరక్షక చట్టం ప్రకారం.. అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటారు. పక్షిని బంధించి చూడటం కంటే ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టలను చూసి ఆనందించడమే నిజమైన విజయదశమి సాంస్కృతి అని పెద్దలు చెబుతూ వస్తున్నారు.