• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /లైఫ్‌స్టైల్
  • /హైబీపీ సైలెంట్ కిల్లర్.. ఈ లక్షణాలు ఉంటే మీ రక్తపోటు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లే!

హైబీపీ సైలెంట్ కిల్లర్.. ఈ లక్షణాలు ఉంటే మీ రక్తపోటు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లే!

మన దేశంలో చాలామంది హై బీపీతో లేదా లో బీపీతో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తుల మాదిరిగానే, ఇది కూడా ప్రతి ముగ్గురిలో ఒకరిలో కనిపిస్తోంది. హై బీపీ వల్ల కొన్ని లక్షణాలు కనిపిస్తాయి, కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి; అందుకే దీనిని 'సైలెంట్ కిల్లర్' అని కూడా పిలుస్తారు.

Written ByRenuka Godugu
Published: Oct 19, 2026, 10:13 AM IST|Updated: Oct 19, 2026, 10:15 AM IST
joinshare
హైబీపీ సైలెంట్ కిల్లర్.. ఈ లక్షణాలు ఉంటే మీ రక్తపోటు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లే!
Image Credit: High Blood Pressure Symptoms

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
దేశంలో ఎక్కడా లేని ఆచారం.. విజయదశమి రోజున రావణుడికి హోమం చేసే గ్రామం ఇదే!

దేశంలో ఎక్కడా లేని ఆచారం.. విజయదశమి రోజున రావణుడికి హోమం చేసే గ్రామం ఇదే!

2

దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలి? శివుడితో సంబంధం ఏంటి?

3

హైబీపీ సైలెంట్ కిల్లర్.. ఈ లక్షణాలు ఉంటే మీ రక్తపోటు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లే!

4

దసరా రోజు రావణుడిని దహనం చేయరు.. దేవుడిలా పూజించే ఆ గ్రామాలు ఏవో తెలుసా?

5

రాజమౌళిపై గుస్సా అవుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. జక్కన్న నోరు విప్పవయ్యా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

హై బ్లడ్ ప్రెషర్ గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది స్ట్రోక్‌కు కూడా కారణం కావచ్చు. బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, దీని కోసం వీరు ప్రతిరోజూ మందులు వాడుతుంటారు. హై బీపీ లేదా లో బీపీ సమస్య ఉన్నవారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది ఈ హై బీపీతో బాధపడుతున్నారు. షుగర్ లాగే, బీపీ కూడా ప్రతి ముగ్గురిలో ఒకరిలో కనిపిస్తూనే ఉంటుంది. దీనికి అనేక ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చు; అనారోగ్యం, అధిక ఒత్తిడి, జీవనశైలిలో సరైన వ్యాయామం లేకపోవడం వంటివి కారణం కావచ్చు. రక్తపోటు ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. మీకు హై బీపీ ఉందని కొన్ని లక్షణాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. తద్వారా వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం అవసరం. హై బీపీతో బాధపడేవారు రోజూ మందులు తీసుకోవడమే కాకుండా, వారి డైట్ కూడా సరిగ్గా ఉండాలి, అప్పుడే ఇది నియంత్రణలో ఉంటుంది.

హై బీపీ వల్ల కనిపించే కొన్ని లక్షణాలు ఇవే..
హై బీపీ ఉన్నవారు కొద్దిగా నడిచినా బాగా ఆయాసంగా అనిపిస్తుంది. అంతేకాకుండా, ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్లుగా అనిపించవచ్చు. కళ్ళలోని రక్తనాళాలు ఎరుపు రంగులోకి మారవచ్చు. ఉదయం లేవగానే తల తిరగడం, బాగా అలసిపోయినట్లు అనిపించడం,  కొంతమందిలో నిద్రలేమి సమస్య ఉండవచ్చు; ఇవి కూడా దీనికి ప్రధాన కారణాలు కావచ్చు. వీరు ఛాతీ నొప్పిని, తలనొప్పిని కూడా అనుభవిస్తారు.
తలనొప్పితో పాటు వికారం మరియు వాంతులు కూడా రావచ్చు, ఇవి కూడా హై బీపీ లక్షణాలే కావచ్చు. ఉదయం పాదాలు ముద్దుబారినట్లు అనిపించడం కూడా హై బీపీ లక్షణాల్లో భాగమే. షుగర్ లక్షణాల మాదిరిగానే, ఇవి కూడా ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉండవచ్చు. ఉదయం ఈ లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. రోజువారీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

Read Also: షుగర్ ఉన్నవారికి కొత్త ముప్పు! 'డబుల్ డయాబెటిస్' వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ? అలర్ట్ లేకపోతే అంతే!
Read Also: సీజన్ మారినప్పుడల్లా జలుబు, జ్వరం వస్తున్నాయా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఇన్ఫెక్షన్లకు బై బై చెప్పండి!

బాధపడుతున్న వారు పొటాషియం ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండవచ్చు. ఈ హై బీపీ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు, వ్యక్తులను బట్టి వేర్వేరుగా ఉంటాయి. అయితే సరైన డైట్, రోజువారీ వ్యాయామం వంటివి పాటిస్తే ఈ రక్తపోటు సమస్య నుండి బయటపడవచ్చు. ఒకవేళ హై బీపీ సమస్య ఎక్కువగా ఉంటే, అది రక్తనాళాల గోడలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది, తద్వారా గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రారంభంలోనే ఈ లక్షణాలను గుర్తించి నియంత్రించుకోవడం ముఖ్యం.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

Add Zee News as a Preferred Source
TAGS:
Health
Home Remedies