• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /దేశంలో ఎక్కడా లేని ఆచారం.. విజయదశమి రోజున రావణుడికి హోమం చేసే గ్రామం ఇదే!

దేశంలో ఎక్కడా లేని ఆచారం.. విజయదశమి రోజున రావణుడికి హోమం చేసే గ్రామం ఇదే!

Ravana Worship News: ఇక్కడ గ్రామంలో విజయదశమి రోజున రావణుడికి శాంతి పూజలతో పాటు హోమం నిర్వహిస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకమైన గ్రామంలో రావణుడి దహనం జరగదు. అసలు ఈ గ్రామం ఎక్కడ ఉంది? ఈ ప్రత్యేకమైన సాంస్కృతిక గల కారణాలేంటి..? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 19, 2026, 10:31 AM IST|Updated: Oct 19, 2026, 10:33 AM IST
joinshare
దేశంలో ఎక్కడా లేని ఆచారం.. విజయదశమి రోజున రావణుడికి హోమం చేసే గ్రామం ఇదే!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
దేశంలో ఎక్కడా లేని ఆచారం.. విజయదశమి రోజున రావణుడికి హోమం చేసే గ్రామం ఇదే!

దేశంలో ఎక్కడా లేని ఆచారం.. విజయదశమి రోజున రావణుడికి హోమం చేసే గ్రామం ఇదే!

2

దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలి? శివుడితో సంబంధం ఏంటి?

3

హైబీపీ సైలెంట్ కిల్లర్.. ఈ లక్షణాలు ఉంటే మీ రక్తపోటు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లే!

4

దసరా రోజు రావణుడిని దహనం చేయరు.. దేవుడిలా పూజించే ఆ గ్రామాలు ఏవో తెలుసా?

5

రాజమౌళిపై గుస్సా అవుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్.. జక్కన్న నోరు విప్పవయ్యా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ravana Worship News: దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆకాశమంత ఎత్తున ఉన్న రావణుడి భారీ దిష్టిబొమ్మను బాణాసంచా వెలుగుల్లో దహనం చేయడం పురాణాలనుంచి వస్తున్న ఒక ఆనవాయితీ.. ఊరు వాడ జైశ్రీరామ్ అనే నినాదాలతో టపాసుల మూతతో రావణ దహన ఘట్టాన్ని ఒక అద్భుతమైన వేడుకగా జరుపుకుంటూ ఉంటారు.. కానీ ఎందుకు పూర్తి భిన్నమైన సాంప్రదాయం భారతదేశంలోని ఓ గ్రామంలో కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. అక్కడ దసరా రోజున రావణుడి బొమ్మను తగలబెట్టడం కీడుగా భావిస్తూ ఉంటారట.. అంతే కాకుండా ఆయన ఆత్మ శాంతికై శాంతి పూజల తో పాటు విశేషమైన అర్చనలు నిర్వహిస్తూ వస్తారట. అసలు ఈ వింత గ్రామం ఎక్కడ ఉంది? రావణుడికి శాంతి పూజను చేయడానికి గల కారణాలేంటి? అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా రామాయణంలో రావణుడిని నాయకుడిగా చూపించినప్పటికీ.. ఆయనలోని గొప్ప శివ భక్తి.. అపారమైన వేద పాండిత్యాన్ని, సంగీత ప్రావిణ్యాన్ని ఆ గ్రామ ప్రజలు ప్రధానంగా స్మరిస్తారు.. రావణుడు రాక్షస మనసుతో సీతాదేవిని అపహరించి తప్పు చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ.. ఆయన గొప్ప పండితుడని.. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రుడైన భక్తుడని అక్కడి ప్రజల విశ్వాసం.. ఒక బ్రాహ్మణోత్తముడిని దహనం చేయడం లేదా దూషించడం శాస్త్ర నమ్మకం కాదని భావించే పూర్వికులు నమ్మకాన్ని నేటి తరంకు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు.

విజయదశమి రోజున ఈ గ్రామంలోని వాతావరణం ఎంతో ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో కొనసాగుతూ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా జిల్లాలో బిస్రఖ్ (Bisrakh) గ్రామం విజయదశమి రోజున పూర్వికులు ప్రతిష్టించిన రావణుడి విగ్రహానికి.. ప్రత్యేకమైన స్థూపానికి పంచామృతాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఆయన కోసం ప్రత్యేకంగా శాంతి హోమం జరిపి అద్భుతమైన నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. రామ రావణ యుద్ధంలో అసువులు బాసిన లంకేశ్వరుడికి మోక్షం లభించి.. ఆయన శాంతింప చేస్తే తమ ఊరికి సమృద్ధి తోపాటు క్షేమం కలుగుతాయని ఆ గ్రామ పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే విజయదశమి రోజున ఈ గ్రామంలో భారీ మొత్తంలో ఆయన పూజలు నిర్వహిస్తూ ఉంటారు..

తమ గ్రామంలో రావణుడిని నిందించకుండా శాంతి పూజలు చేయడం వల్లే పంటలు సమృద్ధిగా పండుతున్నాయని.. ప్రకృతి వైపరీత్యాలు కానీ.. తీవ్రమైన కష్టాలు కానీ ఊరి దరిచేరవని అక్కడి పూర్వికులు విశ్వసిస్తూ ఉంటారు. పొరుగు గ్రామాల్లో బాణాసంచా చెప్పులతో రావణ దహనం జరుగుతున్నప్పటికీ.. ఇక్కడి ప్రజలు మాత్రం నిశ్శబ్దంగా ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఆ లంకేశ్వరుడు భక్తిలో పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా శివ భక్తితో స్వామివారికి ఉపవాసాలు కూడా పాటిస్తారట.. భిన్న నమ్మకాలతో పాటు ప్రత్యేకమైన సాంస్కృతులకు మన దేశం పుట్టినిల్లు. ఈ శాంతి పూజల సాంప్రదాయం భారత సాంస్కృతి గొప్పదని మరోసారి గుర్తు చేస్తూ వస్తోంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News