SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పర్‌ఫ్యూమ్‌లో ఆల్కహాల్ ఎందుకు కలుపుతారో తెలుసా?

Viral News: పర్‌ఫ్యూమ్‌ల తయారీలో ఆల్కహాల్ ఎందుకు వినియోగిస్తారో తెలుసా? చాలా మంది తెలిదు.. అయితే, వివిధ రకాల పువ్వులతో తయారు చేసిన ఆయిల్స్‌తో వీటిని తయారు చేస్తారు. ఇవి చర్మంపై నేరుగా పుసుకోవడం మంచిది కాదు.. అందుకే ఆల్కహాల్ వినియోగించి స్ప్రే చేసుకునే విధంగా తయారు చేస్తారు.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 26, 2026, 12:48 IST | Updated: Nov 26, 2026, 12:50 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Viral News: ప్రస్తుతం బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ పర్‌ఫ్యూమ్ వినియోగించడం సర్వ సాధారణమైపోయింది. శరీరం నుంచి వచ్చే చెమట వాసనను తగ్గించి.. రోజంతా తాజాగా ఉంచడానికి ఇవి ఎంతగానో సహాయపడుతాయి. అయితే, మనం ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసే ఖరీదైన పర్‌ఫ్యూమ్ బాటిళ్లలో సుమారు 70 నుంచి 90 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుందన్న విషయం ఎంతమందికి తెలుసు?. అసలు సువాసన వచ్చే పర్‌ఫ్యూమ్‌లో ఆల్కహాల్ కలపాల్సిన అవసరం ఏముంది? దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఏ పర్‌ఫ్యూమ్ అయినా Essential Oilsతో పాటు ఆల్కహాల్, కొద్దిపాటి నీటి కలుపుతూ ఉంటారు. గులాబీ, మల్లె, గంధం లేదా కస్తూరి వంటి సహజ సిద్ధమైన పూలతో పాటు మూలికల నుంచి తీసే అద్భుతమైన సువాసన కలిగిన ఆయిల్స్‌ వినియోగిస్తూ ఉంటారు. అయితే, వీటిని నేరుగా చర్మంపై వేసుకోవడం అంత మంచిది కాదు.. పైగా బట్టలపై మరకలు పడే అవకాశాలు ఉంటాయి. అందుకే.. ఆ చిక్కని ఆయిల్స్‌ను పల్చగా మార్చి, వాడుకోవడానికి సులభంగా ఉండేందుకు ఒక ద్రవం అసరమవుతుంది. ఆ పనిని ఆల్కహాల్ ఎంతో సులభంగా చేస్తుంది..

పర్‌ఫ్యూమ్ తయారీ చేసేవారు తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ రకాల ఎసెన్షియల్‌ ఆయిల్స్‌, ఇతర రసాయనాలను ఒకే పద్దతిలో కరిగించి.. ఒకే రూపంలో తీసుకు వచ్చేందుకు ఇథనాల్ అద్భుతంగా పని చేస్తుంది.. మనం పర్‌ఫ్యూమ్ స్ప్రే చేసిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతమంతా సువాసనతో నిండిపోవడానికి ప్రధాన కారణం ఆల్కహాల్ గుణమని పర్‌ఫ్యూమ్ తయారు చేసేవారు చెబుతున్నారు. ఆల్కహాల్ గాలి తగలగానే చాలా వేగంగా ఆవిరైపోతుంది.. అలా ఆవిరయ్యే క్రమంలో తనతో పాటు సుగంధ వాసనలను కూడా గాలిలోకి తీసుకెళ్తుంది.. అంతేకాకుండా, స్ప్రే చేసినప్పుడు ద్రవం అత్యంత సూక్ష్మమైన తుంపరలుగా బయటకు రావడానికి.. చర్మంపై జిడ్డు లేదా తడి లేకుండా క్షణాల్లో ఆరిపోవడానికి ఇది ఎంతో వరకు సహాయపడుతుంది..

ఆల్కహాల్ లేకుండా కూడా పర్‌ఫ్యూమ్‌లు తయారు చేయవచ్చు. వీటిని ఆయిల్ బేస్డ్ పర్‌ఫ్యూమ్స్ లేదా అత్తర్లు అంటారు. అయితే, వీటిని తయారు చేసే విధానం, వాడే పద్ధతి పూర్తిగా భిన్నంగా ఉంటాయని పర్‌ఫ్యూమ్‌లు తయారు చేసేవారు చెబుతున్నారు. అన్ని రకాల సువాసనలకు ఆల్కహాల్ తప్పనిసరి కాకపోయినప్పటికీ.. స్ప్రే పర్‌ఫ్యూమ్‌లలో సువాసనను స్థిరంగా ఉంచడానికి.. సులభంగా చల్లుకోవడానికి ఆల్కహాల్ ఎంతగానో సహాయపడుతుంది..
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES