Snakes Video: బాప్ రే.. బుసలు కొడుతున్న పామును సింగిల్ గా పట్టుకున్న యువతి.. వీడియో..
Cobra Video: పాము కోపంతో బుసలు కొడుతూ హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. యువతి ఎక్కడ కూడా భయపడకుండా కోబ్రాను డబ్బాలోకి వెళ్లేలా చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
Woman bravely rescued venomous cobra video: పాములను చూస్తేనే చాలా మంది భయంతో దూరంగా పారిపోతారు. మరోసారి ఆ ప్రదేశంలోకి పొరపాటున కూడా వెళ్లరు. కోబ్రాలకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పాములు చాలా డెంజర్ గా ఉంటాయి. అవి వర్షాకాలంలో వెచ్చగా ఉండే ప్రదేశాలలో వస్తుంటాయి. అందుకు ఇతర కాలాల్లో కంటే వానాకాలంలో పాముల కాటు ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటాయి. పాములు బూట్లలో, బెడ్ ల కింద, కార్లలో దూరి దాక్కుంటాయి.
ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా మనం చూస్తున్నాం. అంతే కాకుండా కోబ్రాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు కూడా చెబుతారు. ముఖ్యంగా కోబ్రాలు చెట్లు గుబురుగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా నివాసం ఉంటాయి. రాత్రి పూట ఇవి ఎలుకల కోసం సంచరిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక పాము వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది.
దీనిలో కోబ్రా ఇంట్లోకి దూరింది. వెంటనే ఇంట్లోని వారు స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించినట్లు ఉన్నారు. యువతి అక్కడకు వచ్చి పామును బంధించేందుకు ప్రయత్నించింది. పలుమార్లు కోబ్రా కోపంతో ఆమెపైకి బుసలు కొడూతు దాడికి యత్నించింది. అయిన ఆమె ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని దానిలో కోబ్రాను చాకచక్యంగా బంధించింది.
కోబ్రాను పట్టుకున్న తర్వాత దగ్గరలో ఉన్న అడవికి తీసుకెళ్లి మరీ దాన్ని వదిలేశారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ఆ కుటుంబం హమ్మయ్యఅని ఊపిరీ పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.