SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Video Viral: ఇదెక్కడి మాస్ రా మావా.. బైక్ షోరూమ్ లో అమ్మవారు పూనినట్లు ఊగిపోయిన మహిళ.. అసలు విషయం తెలిస్తే షాక్.. వీడియో..

Woman claims to be goddess mata rani: మహిళ బైక్ షోరూమ్ కు వెళ్లింది. అక్కడ బైక్ ను తన భర్త కోసం సెలక్ట్ చేసింది. ఆ తర్వాత కొంచెం డిస్కౌంట్ ఇవ్వాలని వారు అడిగారు. ఇంతలో మహిళ ప్రవర్తన చూసి షోరూమ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 19, 2026, 12:58 PM IST | Updated: Oct 19, 2026, 01:04 PM IST
Image Credit: Woman claims to be goddess mata rani video
Join

Woman claims to be goddess mata rani and demands discount for new  motor cycle: దేశ వ్యాప్తంగా దసరా సంబరాలను గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు  ఎంతో భక్తి, శ్రద్దలతో పూజించుకున్నారు. అయితే.. దసరా పండగ వేళ చాలా మంది  కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ రోజున ఏదైన కొత్తది కొనుగోలు చేస్తే ఏడాదంతా కలిసి వస్తుందని ఏదో రూపంలో మంచిజరుగుతుందని చాలా మంది భావిస్తారు. అందుకే కొత్త వాహనాలు లేదా కొత్త బిజినెస్, ఏదైన కొత్త పెట్టుబడి పెట్టడం చేస్తారు. 

 

 

ఈ క్రమంలో ఒక జంట కూడా  కొత్త వాహనాలు కొనేందుకు షోరూమ్ కు వెళ్లారు. అయితే వారు సెలక్ట్ చేసిన బైక్ ధర లక్షా పది వేల రూపాయలు అని సెల్స్ మెన్ చెప్పాడు. ఇంతలో పలు మార్లు ఆ జంట కొంచెం తగ్గించి ఇవ్వాలని కోరారు. కానీ వారు మాత్రం విన్పించుకోలేదు. షోరూమ్ ధర అంతే అని తెల్చి చెప్పారు. దీంతో  ఆ మహిళ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. అమ్మవారు తనను ఆవహించినట్లు వింతగా ప్రవర్తించి గట్టిగా కేకలు పెట్టింది.

ఆమె ప్రవర్తన చూసి షోరూమ్‌లో గందరగోళం నెలకొంది. కొంత మంది అక్కడి నుంచి పారిపోయారు. ఇంతలో షోరూమ్ సిబ్బంది ఆమె భర్తతో ఆమెకు ఫిట్స్ వచ్చాయా..?.. ఆమె ప్రవర్తనకు కారణం ఏంటని అడిగారు. దీనికి ఆ మహిళప పూనకంలో ఊగిపోతూ మాట్లాడింది... "నేను మాతా రాణిని!.. ఈ బైక్‌కు ఇంత ఎక్కువ ధర అడుగుతున్నావా...?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

"నా భక్తులను ఇలా దోచుకోవడంకు అస్సలు ఒప్పుకోను. వెంటనే పది వేల రూపాయలు తగ్గించి, లక్ష రూపాయలకే నా భక్తులకు ఇచ్చేయ్. లేదంటే, ఈరోజు నా ఆగ్రహం నుండి నీ షోరూమ్‌ను ఎవరూ కాపాడలేరంటూ హెచ్చరించింది. దీంతో అప్పుడు కానీ వారికి అసలు సంగతి అర్థం కాలేదు.  ఇలాంటి బెదిరింపులను పట్టించుకునేది లేదని షోరూమ్ యజమాని తెల్చి చెప్పాడు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES