Karnataka: బెంగళూరులో ఘోరం.. లాడ్జీలో ప్రియుడితో గొడవ.. మూడో అంతస్తునుంచి పడి యువతి మృతి..
Woman dies in bengaluru: బెంగళూరుకు చెందిన ఐశ్వర్య (23), సంతోష్ (26) ప్రేమించుకున్నారు. అయితే సంతోష్ ఆమెను శారీరకంగా లొంగ దీసుకున్నారు. పెళ్లి చేసుకొమ్మని చెబితే లాడ్జీకి రమ్మని చెప్పి గొడవ పడ్డాడు. దీంతో ఆమె మూడో అంతస్తు కిటికి నుంచి పడి చనిపోయింది. మరోవైపు యువతి తల్లి మాత్రం తన కూతుర్ని సంతోష్ హత్య చేశాడని ఆరోపిస్తున్నారు.
Woman Dies After Boyfriend Pushes Her From Hotel In Bengaluru: ఇటీవల చాలా మంది యువతీ, యువకులు పెళ్లికాకుండానే లివింగ్ రిలేషన్ లో ఉంటున్నారు. ఇంట్లో వారికి తెలియకుండా హద్దులు మీరి ప్రయత్నిస్తున్నారు. జాబ్ లు, ఇతర పనులతో కొత్త ప్రదేశాల్లోకి వెళ్లి డేటింగ్ లో ఉంటున్నారు. దీంతో కొంత మంది రిలేషన్ లో అవతలి వారిని శారీరంగా వాడుకుని ఆ తర్వాత పెళ్లిఅంటే ముఖం చాటేసుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో ప్రేమించిన వారిని నిలదీస్తే దాడులు చేసి, హత్యలు చేసేందుకు సైతం వెనుకాడటంలేదు.ఈ క్రమంలో బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హసన్ కు చెందిన ఐశ్వర్య (23), సంతోష్ లు (26) ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో లివింగ్ రిలేషన్ షిప్ కొనసాగించారు. యువతిని సంతోష్ శారీరకంగా లొంగ దీసుకున్నాడు.పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే తరచుగా మాటలు మార్చేవాడు. ఈ నేపథ్యంలో యువతి ఇటీవల పెళ్లి విషయంపై తెల్చుకుందామని సంతోష్ కు చెప్పింది. దీంతో ఇద్దరు బెంగళూరులోని ఒక లాడ్జీకి చేరుకున్నారు.
ఐశ్వర్య మాత్రం ఇంట్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లు చెప్పుకొచ్చింది. లాడ్జీలో ఇద్దరు మద్యం తాగారు.ఆ తర్వాత పెళ్లి విషయంలో వాగ్వాదం జరగ్గా.. తాను మూడో అంతస్తు కిటికి నుంచి దూకుతానని చెప్పింది. ప్రియుడు మాట వినక పోవడంతో ఆమె మూడో అంతస్తు కిటికి నుంచి దూకేసింది.దీంతో లాడ్జీ ముందు యువతి శవం చూసి వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు యువతిని ఘటనపై ఆరా తీశారు. అప్పటికే ఆమె ప్రియుడు లాడ్జీనుంచి పరారయ్యాడు. యువతి శవాన్ని పోలీసులు పోస్ట్ మార్టంకు తరలించారు. మరోవైపు యువతి కుటుంబ సభ్యులు ఘటనపై గుండెలవిసేలా రోదించారు. సంతోష్ తమ కూతుర్ని మూడో అంతస్తు కిటికి నుంచి తోసేశాడని ఆరోపణలు చేశారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.