Woman falls from BMTC bus in Bellandur Bengaluru video: ఇటీవల బస్సు ప్రమాద ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. రోడ్డుపై వెళ్తున్న వారు ట్రాఫిక్ నియమాల్ని పాటించాలని పోలీసులు తరచుగా చెప్తుంటారు. అంతే కాకుండా బస్సులోని డ్రైవర్ లు , కండక్టర్ లు సైతం ఫుట్ బోర్డ్ వద్దకు రావొద్దని , బస్సు ఆగే వరకు వెయిట్ చేయాలని తరచుగా చెబుతారు. ఈ క్రమంలో కొంత మంది ప్రయాణికుల నెగ్లీజెన్సీ వల్ల బస్సు ప్రమాద ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. కొన్నిసందర్బాల్లో బస్సు డ్రైవర్ తప్పిదాలు ఉంటే, మరికొన్నిసార్లు ప్రయాణికుల నెగ్లీజెన్సీ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన బస్సు ప్రమాద ఘటన నెట్టింట వైరల్గా మారింది.
Woman Falls on Road While Getting Off BMTC Bus | BMTC ಬಸ್ನಿಂದ ಇಳಿಯುವಾಗ ರಸ್ತೆಗೆ ಬಿದ್ದ ಮಹಿಳೆ . . . . . #BMTC #Kasavanahalli #BengaluruNews #Bellandur #CCTV #Bengaluru #KarnatakaNews https://t.co/xYo1rlAtMV
— Sanjevani News (@sanjevaniNews) November 24, 2026
కర్ణాటకలోని బెంగళూరులో పెను విషాదం సంభవించింది.కసవనహళ్లి–బెల్లందూరు ప్రాంతంలో ఒక మహిళ బీఎంటీసీ నుంచి తనస్టాప్ లో దిగేందుకు ప్రయత్నించింది. కానీ ఇంతలో బస్సు స్పీడ్ గా ఉందో లేదా ఆమెకు బ్యాలెన్స్ కంట్రోల్ తప్పిందో కానీ ఆమె బస్సు నుంచి ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయింది. నడి రోడ్డు మీద మహిళ పడిపోవడంతో అక్కడున్న వారు వెంటనే అలర్ట్ అయ్యారు.
బస్సును డ్రైవర్ కూడా వెంటనే ఆపేశాడు. అక్కడి వారు మహిళకు సపర్యలు చేశారు. ఆమె తలకు బలమైన గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బాధిత మహిళకు వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు.