SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bihar: ఛీ.. ఛీ.. ప్రియుడితో రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన తల్లి.. తమ కామవాంఛకు కొడుకు అడ్డుగా ఉన్నాడని ఘోరం.!.

Woman kills her son in bihar: ఇంట్లో తన తల్లి మరో వ్యక్తితో రొమాన్స్ చేస్తుండగా కొడుకు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు. దీంతో ప్రియుడితో కలిసి బీహర్ కు చెందిన తల్లి దారుణంకు ఒడిగట్టింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Written By Inamdar Paresh
Published: Nov 03, 2026, 01:50 PM IST | Updated: Nov 03, 2026, 02:08 PM IST
Image Credit: Biharwomanaffairnews
Join

Woman kills her son with her lover in bihar: సమాజంలో ఇటీవల కొంత మంది మరీ తెగించి ప్రవర్తిస్తున్నారు. పవిత్రమైన వివాహ బంధానికి మాయని మచ్చగా మారుతున్నారు. వివాహేతర  సంబంధాల్లో పడి కట్టుకున్న భర్త, కన్నవాళ్లను కూడా కాటికి పంపుతున్నారు. తమ కామవాంఛలకు అడ్డుపడితే ఎవరినైన అడ్డు తొలగించేస్తున్నారు. ఇటీవల ఈ ఘటనలు మరీ ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో  బీహర్ లోని భోజ్ పూర్ లో సభ్య సమాజం తలగించుకునే ఘటన చోటు చేసుకుంది. 

బీహార్ భోజ్‌పూర్‌లోని తరారీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా మాలతీదేవీ, సత్యంద్ర సింగ్  ఇద్దరు దంపతులు. వీరికి మోహిత్ రాజ్ అనే 14 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయితే.. మాలతికి కొంతకాలం నుంచి సంతోశ్ కుమార్ సింగ్ అనే  వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది.  దీంతో సీక్రెట్ గా ఇద్దరు రొమాన్స్ చేసుకునే వారు. 

ఈ క్రమంలో మోహిత్.. తన తల్లిని, సంతోష్ ను బెడ్ రూమ్ లో ఏకాంతంగా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీంతో మోహిత్ తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.  ఈ క్రమంలో తల్లి మరోసారి సంతోష్ ను కలవనని చెప్పింది. కానీ మరల సీక్రెట్ గా వారి యవ్వారంను కొనసాగిస్తున్నారు. మరోసారి వీరిని పట్టుకున్న కొడుకు.. తండ్రికి చెప్తానని  తెల్చి చెప్పాడు. ఇక లాభంలేదని తల్లి కొడుకు మర్డర్ కు ప్రియుడితో కలసి స్కెచ్ వేసింది.

డబ్బులు తీసుకురమ్మని మోహిత్‌ను ఏటీఎంకు పంపించింది. ఆ తర్వాత ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది.  సంతోష్ తన ఫ్రెండ్స్‌తో కలిసి.. మోహిత్‌ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. తండ్రి సత్యేంద్ర ..భార్య మాలతిపైన అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసలు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారణ చేయగా అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. మరోవైపు పరారీలో ఉన్న సంతోష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES