SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఎద్దుల ఫైటింగ్ మధ్యలో ఆంటీ ఎంట్రీ.. బిత్తరపోయిన రెండు ఎద్దులు!

Woman Stops Fighting Bulls With Scooter Video: రెండు ఎద్దులు భారీగా దాడి చేసుకుంటున్న సమయంలో ఓ అంటీ స్కూటీపై వచ్చి.. వాటి మధ్యలోనే ఆపేసింది. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 20, 2026, 11:30 IST | Updated: Nov 20, 2026, 11:32 IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Woman Stops Fighting Bulls With Scooter Video: సోషల్ మీడియాలో ఎప్పుడు, ఎలాంటి వీడియోలు వైరల్ అవుతాయో ఊహించడం చాలా కష్టం.. రోడ్డుపై రెండు ఎద్దులు కొమ్ములకు కొమ్ములు తగిలించి దాడి చేసుకుంటే.. ఆ రోడ్డు నుంచి వెళ్లేవారు భయంతో దూరంగా వెళ్లిపోతూ ఉన్నారు. కానీ.. ఈ సమయంలో ఓ ఘటన అందరినీ నవ్వు తెప్పించే విధంగా ఉంది.. ఇప్పుడు ఈ ఘటన చూసిన వారంతా పడిపడి నవ్వుతూ ఉన్నారు. భారీగా దాడి చేసుకుంటున్న రెండు ఎద్దుల మధ్య ఒక మహిళ తన స్కూటీ ఎంట్రీతో క్షణాల్లో ఆపేసిన తీరు అందరినీ ఆశ్చర్యం కలిగించేలా చేస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్స్‌లో @ikaddy_ అనే ఖాతా నుంచి షేర్ చేసిన ఈ సీసీటీవీ వీడియోలో.. ఒక రోడ్డుపై రెండు ఎద్దులు తీవ్ర ఆగ్రహంతో ఒకదానితో ఒకటి దాడి చేసుకోవడం మీరు గమనించవచ్చు... అవి ఎంతో బలంగా కొమ్ములతో ఢీకొట్టుకుంటూ.. ఒకదానినొకటి వెనక్కి నెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించడం మీరు గమనించవచ్చు.. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో అక్కడ కాసేపు యుద్ధ వాతావరణం నెలకొందట. ఆ ఎద్దుల ఆగ్రహానికి చూసి ఎవరైనా సరే వాటి దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడలేదు..

ఎద్దుల దాడి విపరీతం అవ్వడంతో.. ఒక మహిళ స్కూటీ నడుపుకుంటూ అక్కడికి రావడం మీరు గమనించవచ్చు. సాధారణంగా ఎవరైనా అయితే ఎద్దులను చూసి దూరంగా బండి ఆపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆ మహిళ మాత్రం భయపడకుండా.. ఏమీ ఆలోచించకుండా నేరుగా ఆ రెండు ఎద్దుల మధ్యకు వెళ్లి తన స్కూటీని ఆపేయడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా గమనించవచ్చు..

ఆమె స్కూటీ సౌండ్‌ ఒక్కసారి రావడంత గమనించిన ఆ రెండు ఎద్దులు ఒక్కసారిగా ఉలిక్కిపడిపోవడం మీరు చూడొచ్చు. అంతవరకు భీకరంగా దాడి చేసుకున్న ఆ ఎద్దులు.. ఏదో పెద్ద ఆపద వచ్చినట్లుగా వెంటనే తమ దాడిని ఆపేసి వెనక్కి తగ్గడం కూడా మీరు గమనించవచ్చు. ఆ తర్వాత ఆ మహిళ చాలా ప్రశాంతంగా తన స్కూటీని పక్కన ఆపేసి.. కిందకు దిగి అక్కడ ఉన్న మరో ఇద్దరు మహిళలతో కలిసి నిలబడి ఉండడం మీరు చూడొచ్చు.  మేడమ్ వచ్చారు.. ఇక మన గొడవ ఆపేద్దాం.. అన్నట్లుగా ఆ ఎద్దులు సైలెంట్ అయిపోవడం వీడియోలో స్పష్టంగా మీరు చూడొచ్చు..

ఆంటీ విత్ స్కూటీ.. ఆల్వేస్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎంట్రీ.. అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజన్స్‌ పడిపడి కామెంట్లు పెడుతున్నారు.  రెజ్లింగ్ మ్యాచ్ మధ్యలో రిఫరీ వచ్చినట్లుంది.. అంటూ కొంతమంది కామెంట్లు చేయగా.. స్కూటీ పవర్ ముందు ఎద్దుల బలం కూడా పనిచేయలేదు.. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ZEENEWS TRENDING STORIES