Chhath Puja in Delhi: విషపు నురగలో మహిళల ఛట్ పూజ.. బీజేపీ వర్సెస్ ఆప్ మధ్య నెట్టింట ఫైటింగ్.. అసలు మ్యాటర్ ఇదే..
Chhath puja in Yamuna river: తెల్లని నురగలోనే మహిళలు యమునా నదిలో పవిత్రమైన ఛట్ పూజ కార్యక్రమంను నిర్వహించారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఘనత ఇదేనా అంటూ ఆప్ తీవ్రస్థాయిలో మండిపడుతుంది.
Women performs chhath puja celebrations in Yamuna river: దేశ వ్యాప్తంగా నార్త్ స్టేట్స్ లలో ఛట్ పూజ కార్యక్రమంను భక్తి శ్రద్దలతో నిర్వహించుకున్నారు. ముఖ్యంగా రోజంతా ఉపవాసం ఉండి తమ కుటుంబంకు మంచి జరగాలని ప్రార్థిస్తు ఛట్ పూజల్ని మహిళలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా పవిత్రమై గంగా నదిలోకి వెళ్లి సూర్య భగవానుడికి అర్ఘ్యంను ఇస్తారు. అయితే.. ఢిల్లీలో మహిళలు కాళింది కుంజ్ నదిలో ఛట్ పూజ కార్యక్రమంను నిర్వహించారు. యమున నదిలో ఎక్కడ చూసిన కాలుష్యంతో తెల్లని రంగు నురగతో నిండిపోయింది. మురుగు, పరిశ్రమల వ్యర్థాలతో నదిపై తెల్లటి విష పొర పేరుకుపోయింది.
దీనిలో మహిళలు దిగి మరీ ఛట్ పూజను భక్తితో నిర్వహించారు. పక్కనే ప్రమాదకర విషపు నురగలు ఉన్న కూడా వారు భక్తితో ఛట్ పూజలు నిర్వహించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై ఢిల్లీలో రాజకీయదుమారం చెలరేగింది. ఆప్ వర్సెస్ బీజేపీల మధ్య రాజకీయంగా రచ్చగా మారింది.
గతంలో తమపై యమునా నదిలో కాలుష్యం అంటూ ఆరోపణలు చేశారని, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఢిల్లీలో యమునా నది నది ప్రక్షాళన అంటూ వేల కోట్ల ప్రజాధనంను వృథా చేశారంటూ ఆప్ సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. దీంతో బీజేపీ వర్సెస్ ఆప్ గా నెట్టింట పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నారు. మరోవైపు.. ఇంతటి కాలుష్యపు నీళ్లలో కూడా మహిళలు భక్తితో ఛత్ పూజలు చేయడంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇక ఢిల్లీలో వాయుకాలుష్యం కూడా గత 24 గంటల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 370 నుంచి 400 మధ్య నమోదు అయ్యిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే 5 వ తరగతి వరకు స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసుల్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకొవాలని ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఢిల్లీ ప్రజలు వాయు కాలుష్యపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.