SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

"మీరు జెన్ జీ కాదు".. కోర్టులో సీజేపీ నేతలపై ఢిల్లీ హైకోర్టు షాకింగ్ కామెంట్స్..!!

Delhi High Court: సీజేపీకి చెందిన నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా తమ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును ప్రశ్నిస్తూ.. ఢిల్లీ హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ను బుధవారం విత్ డ్రా చేసుకున్నారు.

Written By Bhoomi
Published: Oct 21, 2026, 05:10 PM IST | Updated: Oct 21, 2026, 05:12 PM IST
Image Credit: Delhi High Court
Join

Delhi High Court: సీజేపీకి చెందిన నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా తమ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును ప్రశ్నిస్తూ.. ఢిల్లీ హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ను బుధవారం విత్ డ్రా చేసుకున్నారు. లోయర్ కోర్టులో ఇతర చట్టపరమైన ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు..నేరుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని న్యాయమూర్తుల ధర్మాసనం నిలదీయడంతో పిటిషనర్లు తమ అర్జీని వెనక్కి తీసుకునేందుకు సిద్ధపడ్డారు.

జంతర్ మంతర్ నిరసనకు సంబంధించి అరెస్టు అయిన సౌరవ్ దాస్ (27), అశుతోష్ రాంకా (32)ల జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 19న ఒక ప్రత్యేక కార్యనిర్వాహక మేజిస్ట్రేట్ మరో రెండు రోజులు పొడిగించారు. వారు ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ సుబ్రమోనియం ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  పిటిషనర్ల వయస్సు గురించి న్యాయవాది చెప్పారు.  అయితే మీరు జెన్ జీ కాదు అని అన్నారు. రివిజన్ పిటిషన్ వేసే ఛాన్స్ ఉన్నప్పుడు ఆర్టికల్ 226 కింద నేరుగా హైకోర్టుకు రావడంపై జస్టిస్ సుబ్రమోనియం ప్రశ్నించారు. ఈ పిటిషన్ను విత్ డ్రా చేసుకుని మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ ఫలితం కోసం వేచి చూడటం మంచిదని ధర్మాసనం సూచించింది. హైకోర్టు సూచనను పరిగణలోనికి తీసుకున్న పిటిషనర్లు తమ పిటిషన్ను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో వారి పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.

అసలు ఏం జరిగింది?  
ఢిల్లీలోని 'జంతర్ మంతర్' వద్ద నిరసనలు తెలుపడానికి ఉన్న అనుమతిని తొలగించడాన్ని (డీ-నోటిఫికేషన్) వ్యతిరేకిస్తూ సీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు.  ఢిల్లీ పోలీసుల ప్రకారం.. అక్టోబర్ 13న సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండేలతో పాటు మరో 11 మంది సీజేపీ సభ్యులు ఒక ప్రైవేట్ ఆస్తి మార్గం ద్వారా జంతర్ మంతర్‌కు చేరుకున్నారు.  ఈ క్రమంలో అక్టోబర్ 14న సౌరవ్ దాస్, రాంకాలను సబ్-డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆ తర్వాత కూడా వారి నిర్బంధ కాలాన్ని మరింత పొడిగించారు. శాంతిభద్రతల ముప్పును నివారించేందుకు ఎస్ఈఎం (SEM) జారీ చేసిన ఈ నిర్బంధ ఉత్తర్వులను సవాలు చేస్తూ సీజేపీ న్యాయ బృందం వెంటనే ఢిల్లీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES