Youth consumes alcohol Infront of lord ganesh idol: దేశ మంతట ఎక్కడ చూసిన గణపయ్య నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది వినాయకుడిని ఎంతో భక్తితో ట్రక్ లలో తీసుకొచ్చి షెడ్డులలో ప్రతిష్టించుకుంటారు. ఆ తర్వాత ఉదయం, సాయత్రం వేళల్లో భక్తితో పూజించుకుంటారు. కానీ కొంత మంది నీచులు మాత్రం గణపయ్య ఉత్సవాలను ఏదో సరదాకు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. గణపయ్య విగ్రహం ముందు తాగుతూ నీచంగా ప్రవర్తిస్తారు. తప్పతాగి గణపయ్య విగ్రహంను ముట్టుకుని అపచారాలు చేస్తారు.
बप्पा की मूर्तियों के सामने बैठकर शराब पी रहे थे युवक, लोगों ने रंगेहाथ पकड़ा; वीडियो हुआ वायरल#ViralVideo #GaneshChaturthi #Ganeshotsav #ShamefulAct pic.twitter.com/a20qdlyytn
— Maharashtra Bandhu News (@BandhuNews_in) September 14, 2026
షెడ్డు వెనకాల కూర్చుని పత్తాలు ఆడటం చేస్తారు. కొంత మంది నీచులు ఇలాంటి పనులు చేసిన మొత్తంగా అందరు ఇలానే అని కొంత మంది ట్రోల్ లు చేసి హిందువులను పవిత్ర పండగలను అప్రతిష్టపాలు చేస్తారు. తాజాగా..ఈ కోవకు చెందిన ఒక వీడియో నెట్టింట బాగా వైరల్గా మారింది. ఈ వీడియోలో ఒక ట్రక్ లో గణపయ్యను ప్రతిష్టాపన కోసం తీసుకెళ్తున్నారు.
అయితే దానిలో ఉన్న యువకులు విగ్రహం ముందే కాటున్ లలో లిక్కర్ బాటిళ్లను తాగుతూ నీచంగా ప్రవర్తించారు. కనీసం దేవుడు ముందున్నాడని భయంకూడాలేకుండా తాగుతూ దారుణంకు పాల్పడ్డారు. ఇంతలో వీరి ట్రక్ పక్కనుంచి వెళ్తున్న కొంత మంది వీరిని గమనించారు.
వెంటనే ట్రక్ ను ఆపి వీరి యవ్వారంను వీడియో తీశారు.అక్కడ చూడగా కాటున్ లో బీర్ బాటిళ్లు ఉన్నాయి. వారంతా ఫుల్ గా తాగి ట్రక్ లో గణేష్ విగ్రహంను తీసుకెళ్తున్నారు. చందా డబ్బులతో ఈ విధంగా ఛెండాలం చేశారో కానీ దీనిపై అక్కడున్న యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో కానీ ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ గా మారింది.