BJPలో చేరిన క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. చేరిన వెంటనే కీలక పదవి..
Yuzvendra Chahal Joins BJP: టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీలోకి రావడంతోనే చాహల్ కు కీలక పదవి దక్కింది.
Yuzvendra Chahal Key Post: యుజేంద్ర చాహల్ బీజేపీ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేశారు. అంతేకాదు ఆయనను బీజేబీ జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. ఈ మేరకు బీజేపీ కేంద్రీయ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. చాహల్ అంతకుముందు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యను మర్యాద పూర్వకంగా కలిశారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన యుజేంద్ర చాహల్..
ఓబీసీ మోర్చా కార్యవర్గంలో తనకు అవకాశం కల్పించడంపై యుజ్వేంద్ర చాహల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ కుటుంబంలో తనకు స్థానం, గౌరవం కల్పించినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.
బీజేపీలో కీలక పదవి..
పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలపారు. ఈ అవకాశం తనకు ఎంతో గౌరవప్రదమైనదన్నారు. కాగా, చాహల్ ప్రస్తుతం సయ్యర్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హరియాణా జట్టుకు ఆడుతున్నాడు. ఇటీవల తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో చాహల్ అరుదైన ఘనత సాధించాడు. నాలుగు ఓవర్లలో 16 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20ల్లో 400 వికెట్ల మైలురాయి పూర్తి చేసిన భారత తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇప్పటిదాకా చాహల్ 402 వికెట్లు పడగొట్టాడు.