School Holiday:వినాయక చవితి తర్వాత సెప్టెంబర్ 16, 17 తేదీల్లో సెలవులు ఉంటాయా అని చాలామందికి సందేహం ఉంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలలో 17 సెలవు ఉండటం వల్ల, ఈ అనుమానం మరింత పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు రోజులకు సంబంధించిన హాలిడేస్‌పై పూర్తి వివరాలు, ప్రాంతాల వారీగా క్లారిటీ ఇదే.
1/6
వినాయక చవితి సెలవులు
వినాయక చవితి పండుగ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 15న జరుపుకోనున్నారు. పండుగ రోజు సెలవు ఉండటంతో పాటు, ఆ తర్వాత కూడా సెలవులు ఉంటాయనే వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీంతో సెప్టెంబర్ 15, 16, 17 తేదీల్లో వరుసగా మూడు రోజులు సెలవులు ఉంటాయా అనే సందేహం చాలా మందిలో ఉంది.
2/6
వినాయక చవితి సెలవులు 2026
అయితే దీనిపై స్పష్టత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ 17, 2026న దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వివిధ కారణాలతో సెలవులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో విశ్వకర్మ పూజ సందర్భంగా సెలవు ఉంటుంది. అలాగే కొన్ని స్థానిక ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాల కారణంగా స్థానిక సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
3/6
సెప్టెంబర్ 16 సెలవు
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వినాయక నిమజ్జనం కారణంగా కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 17న సెలవు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తిరుపతిలో వినాయక నిమజ్జనం బుధవారం జరగనున్న నేపథ్యంలో అక్కడ స్థానికంగా సెలవు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇలాంటి సెలవులు మొత్తం రాష్ట్రానికి వర్తించవు. ఏ ప్రాంతంలో నిమజ్జనం జరుగుతుందో, అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి అధికారులు నిర్ణయం తీసుకుంటారు.
4/6
వినాయక చవితి 2026
ఇదే సమయంలో సెప్టెంబర్ 16 గురించి కూడా చాలా మందిలో గందరగోళం ఉంది. సెప్టెంబర్ 15న వినాయక చవితి, సెప్టెంబర్ 17న కొన్ని ప్రాంతాల్లో సెలవు ఉండటంతో మధ్యలో ఉన్న సెప్టెంబర్ 16న కూడా సెలవు ఉంటుందని కొందరు భావిస్తున్నారు. కానీ సాధారణంగా సెప్టెంబర్ 16 బుధవారం వర్కింగ్ డేగానే ఉంటుంది.
5/6
సెప్టెంబర్ 17 సెలవు
అయితే కొన్ని పాఠశాలలు తమ స్థానిక పరిస్థితులను బట్టి సెప్టెంబర్ 16న కూడా సెలవు ఇవ్వవచ్చు. ముఖ్యంగా వినాయక నిమజ్జనం ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పాఠశాల యాజమాన్యాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
6/6
గణేష్ నిమజ్జనం 2026
అందువల్ల సెప్టెంబర్ 15 తర్వాత సెప్టెంబర్ 16, 17 తేదీల్లో వరుసగా రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ఉన్నాయని చెప్పడం సరైంది కాదు. సెప్టెంబర్ 16 సాధారణ వర్కింగ్ డే. సెప్టెంబర్ 17న మాత్రం కొన్ని ప్రాంతాల్లో స్థానిక సెలవు ఉండొచ్చు. మీ పాఠశాల లేదా స్థానిక అధికారులు ప్రత్యేకంగా ప్రకటిస్తే మాత్రమే సెప్టెంబర్ 16న సెలవుగా పరిగణించాలి. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను మాత్రమే నమ్మకుండా తమ పాఠశాల నుంచి వచ్చే అధికారిక సమాచారం తెలుసుకోవడం మంచిది.