8 Breakfast Dishes Made With Eggs: కేవలం రుచి మాత్రమే కాదు.. రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు శరీరానికి శక్తినిచ్చే 8 ఫేమస్ ఎగ్ బ్రేక్ ఫాస్ట్ రెసీపీలను ఇప్పుడు చూద్దాం.
8 Breakfast Dishes Made With Eggs: కోడిగుడ్డు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమ్లేట్. లేదంటే అండా భూర్జీ. కోడిగుడ్డులో శరీరానికి అవసరమైన ఖనిజాలు, ప్రొటీన్, ఇమ్యూనిటీ అందించే గుణాలెన్నో ఉన్నాయి. రోజుకో గుడ్డు తింటే ఎవరికైన విసుగు వస్తుంది. కానీ కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసి ఉదయం బ్రేక్ ఫాస్టులో కోడిగుడ్డుతో అద్భుతమైన నోరూరించే రకరకాల రెసీపీస్ చేసుకోవచ్చు.
కేవలం రుచి మాత్రమే కాదు.. రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు శరీరానికి శక్తినిచ్చే 8 ఫేమస్ ఎగ్ బ్రేక్ ఫాస్ట్ రెసీపీలను ఇప్పుడు చూద్దాం.
1/7
ఎగ్ దోశ:
ఎగ్ దోశ: దక్షిణాదిలో చాలా మంది అత్యంత ఇష్టంగా తినే టిఫిన్ దోశ. దోశ వేసి సగం కాలిన తర్వాత.. దానిపై ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరా, మసాలాలు కలిపిన ఎగ్ మిశ్రమాన్ని పోసి దోశపై రుద్దుతారు. పోషకాలు ఇంకా పెరగాలంటే ఇందులో క్యారెట్ తురుము, క్యాప్సికమ్, బీన్స్ వంటి కూరగాయలు కూడా జోడించవచ్చు.
2/7
షాక్‌షుకా :
షాక్‌షుకా : ఇది మిడిల్ ఈస్ట్ దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన సాంప్రదాయ వంటకం. టమోటో,క్యాప్సికం, వెల్లుల్లి, జీలకర్రలతో చేసే ఘాటైన గ్రేవీలో కోడిగుడ్లను పొచ్ చేసి తయారుచేస్తారు. దీనిని బ్రెడ్ లేదా టోస్ట్‌తో నంజుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది.
3/7
పోచ్‌డ్ ఎగ్:
పోచ్‌డ్ ఎగ్: నూనె లేదా నెయ్యి అసలు వాడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి పోచ్‌డ్ ఎగ్ బెస్ట్ ఛాయిస్. మరిగే నీటిలో గుడ్డు పెంకు తీసి నేరుగా వేసి ఉడికిస్తారు. లోపల పసుపు సొన ద్రవ రూపంలో ఉండి, పైన తెల్లసొన గడ్డకడుతుంది. దీనిని బ్రెడ్ లేదా ప్రెష్ సలాడ్‌తో కలుపుకుని తింటారు.
4/7
ఎగ్ అప్పం:
ఎగ్ అప్పం: కేరళలో అత్యంత ప్రజాదరణ పొందిన టిఫిన్ ఇది. వేడి అప్పం మధ్యలో గుడ్డును పగలగొట్టి వేసి,ఉప్పు, మిరియాల పొడి చల్లి ఉడికిస్తారు. వెజిటబుల్ లేదా చికెన్ స్టూతో ఈ ఎగ్ అప్పం తింటే ఆహా అనిపిస్తుంది.
5/7
అండా ఘోటాలా:
అండా ఘోటాలా: గుజరాత్‌లోని సూరత్ నగరంలో పుట్టిన ఈ స్ట్రీట్ ఫుడ్..ఇప్పుడు దేశమంతా ఫేమస్ అయ్యింది. వెన్న, పావ్ భాజీ మసాలాలు, టమోటో-ఉల్లిపాయ గ్రేవీలో గుడ్లను మ్యాష్ చేసి తయారు చేస్తారు. దీనిని వేడివేడి పావ్ లేదా బ్రెడ్‌తో నంజుకుని తింటారు.
6/7
ఎగ్ కట్లెట్:
ఎగ్ కట్లెట్: ఉడకబెట్టిన గుడ్లను బాగా మ్యాష్ చేసి, అందులో మసాలాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర కలిపి చిన్న చిన్న బిస్కట్ బిళ్లల్లా చేసుకొని పాన్‌పై లైట్‌గా షాలో ఫ్రై చేస్తారు. క్రంచీగా, టేస్టీగా ఉండే ఈ కట్లెట్ పిల్లలకు ఎంతగానో నచ్చుతుంది.
7/7
ఎగ్ మఫిన్స్
ఎగ్ మఫిన్స్: తక్కువ సమయంలో రెడీ అయిపోయే మోడరన్ బ్రేక్‌ఫాస్ట్ ఇది. గుడ్డు మిశ్రమంలో సన్నగా తరిగిన కూరగాయలు, చీజ్, మూలికలు కలిపి మఫిన్ ట్రేలలో పోసి ఓవెన్‌లో బేక్ చేస్తారు. ఇవి తేలికగా, ప్రోటీన్ సమృద్ధిగా ఉండి బిజీగా ఆఫీసులకు వెళ్లేవారికి చక్కటి బ్రేక్ ఫాస్ట్ అని చెప్పాలి.