• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /AP Dasara Holidays Update: ఏపీలో విద్యార్థులకు ముందుగానే దసరా సెలవులు.. ఎప్పటి నుంచి అంటే?

AP Dasara Holidays Update: ఏపీలో విద్యార్థులకు ముందుగానే దసరా సెలవులు.. ఎప్పటి నుంచి అంటే?

Written ByVishnu Priya
Published: Oct 06, 2026, 11:01 AM IST|Updated: Oct 06, 2026, 11:07 AM IST
joinshare

AP Dasara Holidays Update: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులపై స్పష్టత వచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అయితే విద్యార్థులకు సెలవులు అంతకంటే ముందుగానే ప్రారంభం కానున్నాయి. దీంతో పిల్లలకు పండుగకు ముందు నుంచే హాలిడేస్ లభించనున్నాయి.
 

AP Schools Dasara Holidays1/5

ఏపీ పాఠశాలల సెలవులు

అక్టోబర్ 10వ తేదీ రెండో శనివారం కావడంతో ఆ రోజు పాఠశాలలకు సాధారణంగానే సెలవు ఉంటుంది. ఆ తర్వాత అక్టోబర్ 11 ఆదివారం. ఈ రెండు రోజులు వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులకు అక్టోబర్ 10 నుంచే దసరా సెలవుల వాతావరణం మొదలవుతుంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు కొనసాగుతాయి. ఈ సెలవుల అనంతరం అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అంటే విద్యార్థులకు వరుసగా దాదాపు 12 రోజుల పాటు స్కూల్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
AP Education Department2/5

దసరా సెలవులు

దసరా సందర్భంగా విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకునేందుకు ఈ సెలవులు ఉపయోగపడనున్నాయి. దసరా శరన్నవరాత్రుల సమయంలో చాలా కుటుంబాలు సొంత ఊళ్లకు వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకుంటాయి. ముందుగానే సెలవులు రావడంతో ప్రయాణాలకు కూడా కొంత సౌకర్యంగా ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
 School Holidays in AP3/5

స్కూల్స్ రీఓపెన్ డేట్

విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా పండుగ సమయంలో కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం లభించనుంది. అయితే క్రిస్టియన్ ఎయిడెడ్ పాఠశాలలకు సెలవుల విషయంలో కొంత మార్పు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ పాఠశాలలకు క్రిస్మస్ సెలవుల షెడ్యూల్ కూడా ఉండటంతో దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని పేర్కొన్నారు.
 Dasara Holidays 20264/5

ఇంటర్ విద్యార్థులకు కూడా సెలవులు

ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా దసరా సెలవులు ఉండనున్నాయి. బోర్డు షెడ్యూల్ ప్రకారం జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 10 నుంచి 20 వరకు సెలవులు ఇవ్వనున్నారు. అయితే సెలవులకు ముందు క్వార్టర్లీ పరీక్షలను కాలేజీలు నిర్వహించనున్నాయి. దసరా సెలవులు ముగిసిన తర్వాత అక్టోబర్ 21న జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయి.
 AP School Reopening Date5/5

ఏపీ విద్యార్థులు

ఏపీ విద్యార్థులకు ఈసారి దసరా పండుగ సందర్భంగా ముందుగానే సెలవులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 10 నుంచి సెలవుల వాతావరణం మొదలై, అక్టోబర్ 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
TAGS:
School Holiday

Trending

  • News
  • Photos
  • Videos
Rahul Gandhi: బారికెడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే నంటూ డిమాండ్.. ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్..

Rahul Gandhi: బారికెడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే నంటూ డిమాండ్.. ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్..

2

రోమ్ వీధుల్లో 9 ఏళ్లుగా భిక్షాటన చేసి.. పెద్ద ఇల్లు కట్టిన నైజీరియా వ్యక్తి!

3

ఆధార్‌ కార్డ్‌లో ఇంటి పేరు మార్పుపై ఊరట.. వివాహమైన మహిళలకు UIDAI కీలక నిబంధనలు!

4

Hyderabad: గచ్చిబౌలీలో తీవ్ర విషాదం.. సూసైడ్ నోట్ రాసి ఐటీ ఉద్యోగిని బలవన్మరణం.. అసలు కారణం ఏమిటంటే..?..

5

India bloc Protest: ఢిల్లీలో మరోసారి హైటెన్షన్.. పార్లమెంట్ నుంచి ఈసీకి ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ.. భారీగా బలగాల మోహరింపు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.