Citroen Basalt: సిట్రోయెన్ బసాల్ట్ మార్కెట్‌లో అతి తక్కవ ధరలోనే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంది. అయితే, ఈ కారును EMI ఆప్షన్‌తో కొనుగోలు చేయాలనుకునేవారు.. ఎంత మొత్తంలో డౌన్‌పేమెంట్ చేయాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Citroen Basalt: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీ కూపే (SUV Coupe) డిజైన్‌తో వచ్చిన కార్లు జోరుగా విక్రయమవుతున్నాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా కొనుగోలుయ చేస్తున్నారు. అయితే, టాటా విడుదల చేసిన కర్వ్‌కి మంచి ప్రజాదరణ లభించడంతో చాలా కంపెనీ ఇదే తరహాలో కార్లను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. గతంలోనే సిట్రోయెన్ కూడా కూపే ఎస్‌యూవీని విడుదల చేసిన సంగతి తెలిసిందే..
1/5
సింపుల్ EMI ఫ్లానింగ్
ప్రస్తుతం సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ కారుపై పండుగల సీజన్ ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అయితే, దీని కోసం మీ దగ్గరలో ఉన్న షోరూమ్‌ను సందర్శించాల్సి ఉంటుంది. స్టైలిష్ కూపే డిజైన్‌తో మంచి ఎస్‌యూవీ అనుభవాన్ని కావాలనుకునేవారు ఈ సింపుల్ EMI ఫ్లానింగ్ మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది.
2/5
వడ్డీ రేటు
ఈ 48 నెలల సమయానికి అసలు లోన్ రూ.4,22,121 కాగా.. 8.20 శాతం వడ్డీ రేటుతో కలిపి బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తం రూ. 4,96,560 అవుతుంది. అంటే నాలుగేళ్లకి వడ్డీ రూపంలో అదనంగా చెల్లించే మొత్తం కేవలం రూ.74,439 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనిపై కొన్ని రకాల అదనపు ఛార్జిలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.
3/5
బ్యాంక్ వడ్డీ రేటు
ఈ లోన్ మొత్తానికి బ్యాంక్ వడ్డీ రేటు సంవత్సరానికి 8.20 శాతం వరకు వడ్డీ అనుకుంటే.. ఈ లోన్‌ను EMI ద్వారా తిరిగి చెల్లించేందుకు 4 సంవత్సరాల కాలానికి చూస్ చేసుకుంటే.. ప్రతి నెలా చెల్లించాల్సిన EMI కేవలం రూ.10,345 మాత్రమే అవుతుంది. దాదాపు రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువ కలిగిన ప్రీమియం కూపే కారు కేవలం పది వేల EMIతోనే లభిస్తోంది..
4/5
వేరియంట్
సిట్రోయెన్ బసాల్ట్ యు పెట్రోల్ (Petrol ) వేరియంట్ ధర హైదరాబాద్ మార్కెట్‌లో ఆన్-రోడ్ ప్రకారం రూ. 10,22,121లకు లభిస్తోంది.. ఈ కారును ఫైనాన్స్‌తో కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు రూ.6 లక్షల వరకు డౌన్ పేమెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.. ఈ డౌన్ పేమెంట్ పోను.. మిగిలిన రూ.4,22,121 మొత్తాన్ని లోన్‌గా తీసుకోవాల్సి ఉంటుంది..
5/5
ప్రీమియం డిజైన్
టాటా కర్వ్ పోటీగా సిట్రోయెన్ బసాల్ట్ లాంచ్ అయ్యింది. ఇది ప్రీమియం డిజైన్‌తో పాటు అద్బుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ కారును భారతీయులు కూడా ఎంతో ఆసక్తిగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. మీరు కూడా ఎప్పటి నుంచో ఇదే కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా?