• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Harish Rao: కరెంట్‌, నీళ్లు లేక రైతుల కన్నీళ్లు.. ధైర్యం చెప్పిన హరీశ్‌ రావు

Harish Rao: కరెంట్‌, నీళ్లు లేక రైతుల కన్నీళ్లు.. ధైర్యం చెప్పిన హరీశ్‌ రావు

Harish Rao With Farmers: ఎల్‌నినో ప్రభావం అని చెప్పి విద్యుత్‌ కోతలు.. నీళ్లు ఇవ్వకపోవడంతో కళ్ల ముందు పంటలు దెబ్బతింటుండడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. రైతులు కన్నీళ్లు పెట్టుకోగా మాజీ మంత్రి హరీశ్‌ రావు వారిని ఓదార్చి ధైర్యం ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 06, 2026, 02:14 PM IST|Updated: Nov 06, 2026, 02:23 PM IST
joinshare
Harish Rao: కరెంట్‌, నీళ్లు లేక రైతుల కన్నీళ్లు.. ధైర్యం చెప్పిన హరీశ్‌ రావు
Image Credit: Harish Rao Agriculture Fields Visit

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కొత్త బాదుడు.. ఏకంగా 29 నెలల కరెంట్ బిల్లు కట్టాల్సిందే!

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కొత్త బాదుడు.. ఏకంగా 29 నెలల కరెంట్ బిల్లు కట్టాల్సిందే!

2

బెండకాయతో ఇలా చేస్తే.. చికెన్, మటన్ కూడా వేస్ట్టే!

3

Harish Rao: కరెంట్‌, నీళ్లు లేక రైతుల కన్నీళ్లు.. ధైర్యం చెప్పిన హరీశ్‌ రావు

4

Anand Mahindra: రాప్తాడు బాలిక లక్ష్మికి ఆనంద్ మహీంద్రా అండ.. చదువు ఖర్చులన్నీ భరిస్తానని హామీ..

5

Motorola నుంచి పవర్‌ఫుల్ ఫోన్‌.. Snapdragon 8 Gen 5, 12GB ర్యామ్‌తో Moto One లాంచ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Narsapur: తెలంగాణలో ఎల్‌నినో పరిస్థితులతో రైతుల పంటలకు సాగునీరు అందడం లేదు. దీనికి తోడు కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యుత్‌ సరఫరా కూడా లేకపోవడంతో పంటలు కళ్ల ముందే దెబ్బతింటుంటే రైతులు లబోదిబోమంటున్నారు. పంటలు తీవ్రంగా నష్టపోతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎండిపోయిన పంటల పరిశీలనకు వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌ రావు ముందు రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. తమ కష్టాలు.. బాధలు చెబుతూ విలపించారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఎండిపోయిన పంటలను శుక్రవారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. ఈ పర్యటనలో రైతులు అడుగడుగునా కన్నీరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు రాక, సాగునీరు అందక చేతికొచ్చిన వరి పంటలు కళ్లముందే ఎండిపోయాయని రైతులు వాపోయారు. సకాలంలో కరెంటు అందక తన 7 ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని ఓ రైతు కంటతడిపెట్టారు.

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంటుతో రెండు పంటలు పండించుకున్నాం.. ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందని రైతులు వాపోయారు. వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలవుతున్నా.. కనీసం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుబంధు పూర్తిగా ఎగ్గొట్టారని కేవలం ఒక్క ఎకరానికే వేసి రేవంత్ సర్కార్ చేతులు దులుపుకుందని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల బృందం ముందు హరీశ్ రావుకు రైతులు మొరపెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన రైతు రుణమాఫీ అంతా బోగస్.. గ్రామంలో పది మందిలో కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయాం.. మళ్లీ 100 శాతం కేసీఆర్ సార్ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడే తమ కష్టాలు తీరుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

రైతుల కష్టాలు విన్న మాజీ మంత్రి హరీశ్‌ రావు ధైర్యం చెప్పారు. అధైర్యపడకండి.. ఈ రెండేళ్లు రేవంత్ రెడ్డి మెడలు వంచి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మార్పు అంటే కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటును, రైతుబంధును బంద్ పెట్టి పచ్చని పొలాలను ఎండబెట్టడమేనా? అని రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఎండిన ప్రతి ఎకరానికి ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే వరకు పెండింగ్ రైతుబంధు, పూర్తిస్థాయి రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Harish rao
Telugu News
Telangana News
Politics